X
ఆర్ఆర్ఆర్ - రౌద్రం రణం రుధిరం
Action | Romance | 25 Mar 2022 | U/A | 186 Mins
Telugu

ఆర్ఆర్ఆర్ - రౌద్రం రణం రుధిరం స్టోరీ

ఆర్ఆర్ఆర్ - రౌద్రం రణం రుధిరం సినిమా యాక్షన్, ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జూనియర్ యన్ టి ఆర్రామ్ చరణ్ తేజ, అలియా భట్, అజయ్ దేవగణ్, పి సముద్రఖని, రే స్టీవెన్సన్‌, ఓలివియా మోరీస్‌ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ ఎస్ రాజమౌళి వహిస్తున్నారు  మరియు నిర్మాత డి వి వి దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి అందించారు. 

 
ఆర్ఆర్ఆర్ కథ

భారత్‌లో బ్రిటీష్ పాలన కొనసాగుతున్న కాలంలో రామరాజు (రాంచరణ్) పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. స్వాతంత్ర్యం కోసం, ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకొనేందుకు బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న భీమ్ ఓ కారణంగా (ఎన్టీఆర్) ఢిల్లీలోని బ్రిటన్ సర్కార్‌పై విధ్వంసం సృష్టిస్తాడు. బ్రిటీష్ పాలనకు ఎదురు తిరిగిన భీమ్‌ను పట్టుకొనేందుకు రామరాజును ప్రత్యేక అధికారిగా నియమిస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న భీమ్‌ను రామరాజు పట్టుకొన్నాడా? ప్రభుత్వానికి శత్రువైన భీమ్‌తో రామరాజు ఎందుకు స్నేహం చేశాడు? భీమ్‌కు రామరాజు ఎలాంటి సాయం చేశాడు? భీమ్‌కు సహాయం చేసిన రామరాజు ఎలాంటి శిక్షను ఎదుర్కొన్నాడు. భీమ్, రామరాజు మధ్య స్నేహం పెరగడానికి సీత (ఆలియాభట్) ఎలాంటి పాత్రను పోషించింది. ఈ కథలో అజయ్ దేవగన్, శ్రీయ పాత్రలు ఏమిటి? రామ్, భీమ్ ఇద్దరు కలిసి బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఎలా గడగడలాడించారు అనే ప్రశ్నలకు సమాధానమే RRR మూవీ కథ.


మేకింగ్

కొమురం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజు పాత్రను మెగా హీరో రామ్ చరణ్ పోషించాడు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్, రామ్ చరణ్‌ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తోంది. బాలీవుడ్ అగ్రనటుడు అజయ్ దేవగణ్, శ్రీయ కీలకపాత్రలు పోషించారు. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించారు. ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్‌ఆర్‌కు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. సినిమా డిజిటల్ రైట్స్‌కు పలు సంస్థలు భారీగా చెల్లించాయి.


విడుదల 
ఆర్ఆర్ఆర్ చిత్రం మార్చి 25న వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
  

మార్కెటింగ్

‘ఆర్‌ఆర్‌ఆర్‌’రిలీజ్‌కు ముందే దాదాపు రూ.700 కోట్ల థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్, ఇతర బిజినెస్ చేసింది.

బుడ్జెట్ 

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బడ్జెట్ లెక్కలు అంతకంతకూ పెరిగి పోతూనే ఉన్నాయి. ఇక బాహుబలి సినిమా తో రెండు వేల కోట్లు మార్కెట్ ను చూపించిన దర్శకుడు రాజమౌళి మరోసారి అంతకుమించి అనేలా బాక్సాఫీస్ కలెక్షన్స్ లెక్కలను క్రియేట్ చేయబోతున్నాడు.RRR సినిమాకు 450 కోట్లు ఖర్చు చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగానే క్లారిటీ ఇచ్చింది. 

రన్ టైమ్ అండ్ సెన్సార్ 

RRR ర‌న్ టైమ్ బాహుబ‌లిని మించింది. 3 గంట‌ల 6 నిమిషాల ర‌న్ టైమ్‌గా రాజ‌మౌళి ట్రిపుల్ ఆర్ ర‌న్ టైమ్‌ను ఫిక్స్ చేశారు. అలాగే సినిమాకు యు/ఎ స‌ర్టిఫికేట్ వ‌చ్చింది.

రిలీజ్ డేట్ 

మార్చి 25న తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో పాన్ వ‌రల్డ్ మూవీగా భారీ రేంజ్‌లో రిలీజ్ అవుతుంది.



'ఆర్ఆర్ఆర్' సినిమాలో 'నాటు నాటు...' పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంటున్న కీరవాణి. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు అందుకుని మన సినిమా సత్తా చాటింది. 

'నాటు నాటు'కు ఆస్కార్ అవార్డు 

'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' (ఉత్తమ పాట) విభాగంలో 'నాటు నాటు'కు 95వ ది అకాడమీ అవార్డ్ అందుకుంది. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు పాటగా, ఆ మాటకు వస్తే తొలి భారతీయ సినిమా పాటగా 'నాటు నాటు...' చరిత్ర సృష్టించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+