CelebsbredcrumbJr. Ntr
  జూనియర్ యన్ టి ఆర్

  జూనియర్ యన్ టి ఆర్

  Actor/Singer
  Born : 20 May 1983
  Birth Place : హైదిరాబాద్
  నందమూరి తారక రామారావు తెలుగు సిని నటుడు అభిమానులందరు జూనియర్ యన్.టి.ఆర్, తారక్ రామ్, యంగ్ టైగర్  అని పిలుచుకుంటారు. 20 may 1983 నందమూరి హరికృష్ణ మరియు శ్రీమతి శాలిని కి జూనియర్ యన్.టి.ఆర్ హైదరాబాద్ లో జన్మించాడు.గుడివాడలోని మొంటిస్సోరి స్కూల్ లో చదివిన... ReadMore
  Famous For
  నందమూరి తారక రామారావు తెలుగు సిని నటుడు అభిమానులందరు జూనియర్ యన్.టి.ఆర్, తారక్ రామ్, యంగ్ టైగర్  అని పిలుచుకుంటారు. 20 may 1983 నందమూరి హరికృష్ణ మరియు శ్రీమతి శాలిని కి జూనియర్ యన్.టి.ఆర్ హైదరాబాద్ లో జన్మించాడు.గుడివాడలోని మొంటిస్సోరి స్కూల్ లో చదివిన యన్.టి.ఆర్ ఇంటర్ మీడియట్ ను హైదరాబాద్ లోని సెయింట్ మేరీ జూనియర్ కాలేజీ లో కొనసాగించారు. 


  చదువు తో పాటే నటనలోను, కూచిపూడి నాట్యంలోనూ ఓనమాలు దిద్దాడు జూనియర్. అప్పుడు కూచిపూడి డాన్సులో తీసుకున్న శిక్షణ మూలంగానే ఇప్పుడు ఎటువంటి నృత్య రీతిని అయిన అవలీలగా ప్రదర్శిస్తూ డాన్సర్ గా అబిమానులను అలరిస్తున్నాడు. నటనలో ఆడుగులు వేయటం తాతగారి వద్ద నేర్చుకున్న జూనియర్, సీనియర్...
  Read More
  • NTR 30 మోషన్ పోస్టర్
  • ఎత్తర జెండా ఫుల్ వీడియో సాంగ్- ఆర్ ఆర్ ఆర్
  • దోస్తీ ఫుల్ వీడియో సాంగ్ - ఆర్ ఆర్ ఆర్
  • నాటు నాటు ఫుల్ వీడియో సాంగ్ - ఆర్ ఆర్ ఆర్
  • ఎత్తర జెండా ప్రోమో సాంగ్ - ఆర్ ఆర్ ఆర్
  • రామమ్ రాఘవమ్ సాంగ్ -ఆర్ ఆర్ ఆర్
  • 1
   తాత ఎన్టీఆర్ నట సార్వభౌముడు.. తెలుగు సినిమా ఇండస్ట్రీకే టార్చ్ బేరర్ ఆయన. అలాంటి కుటుంబం నుంచి నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడంటే అతని ప్రయాణం నల్లేరుపై నడకే అనుకోవచ్చు కాని.. ఎన్టీఆర్ బ్యాగ్రౌండ్ ఉపయోగడింది..
  • 2
   నటుడిగా తనని తాను నిరూపించుకుని నిలదొక్కున్న తరువాత మాత్రమే. పెద్ద వంశం... నట వారసుడు ఇవి చెప్పుకోవడానికే కాని.. ఎన్టీఆర్ శ్రమకు అండగా నిలిబడలేకపోయాయి. తాత ఉండి ఉంటే పరిస్థితి వేరులా ఉండేదేమో కాని.. ‘నందమూరి’ అనే బ్యాగ్రౌండ్ కొన్నాళ్లవరకూ టైటిల్ కార్డ్‌గా మాత్రమే ఉపయోగపడింది. బ్యాగ్రౌండ్ ఉన్నా.. తారక మంత్రం జపించాల్సిందే అని ఎన్టీఆర్
  • 3
   కష్టం, కఠోర శ్రమకు అద్దం పట్టిన ఎన్టీఆర్ ఈరోజు అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ఒకరిగా ఉన్నారంటే ఒకప్పుడు ఒకరిగా పోరాటం చేసినందుకే. ఎన్నో అవమానాలు, మరెన్నో వేదనలు.. అందరూ ఉన్నా ఆ అందరిలో ఒకడు కావడానికి ఎన్టీఆర్‌కి చాలా ఏళ్లు పట్టింది. నటుడిగా ఎన్టీఆర్‌కి అసలు సిసలు వారసుడు ఈ తారకరాముడే అని జనం నుంచి గళం వినిపించడంతో ఇప్పుడు నందమూరి వంశంలో జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు అయ్యాడు. బాబాయ్ మనసు గెలిచి నిలిచాడు.
  • 4
   బాల నటుడిగా ‘బాల రామయణం’ చిత్రంతో కెరియర్ మొదలుపెట్టిన ఎన్టీఆర్.. ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఎన్టీఆర్‌ని ఇతను కూడా నట వారసుల బాపతే అని హేళన చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ అంటే అటొచ్చి ఇటెళ్లే బాపతు కాదని తన రెండో సినిమా ‘స్టూడెంట్ నెం.1’తో నిరూపించాడు. రాజమౌళి దర్శకత్వంలో తొలి హిట్ అందుకున్న ఎన్టీఆర్.. తరువాత వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆది’ సినిమాతో తనలోని కసిని చూపించారు. తొడకొట్టి మరీ బాక్సాఫీస్ ఆది చిత్రంతో శాసించాడు. అనంతరం తిరిగి మళ్లీ రాజమౌళి ‘సింహాద్రి’ సినిమా ద్వారా మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని స్టార్ హీరోలకు ప
  • 5
   ఎన్టీఆర్ తొడకొడితే థియేటర్స్ దద్దరిల్లేవి.. ఎంతో కష్ట సాధ్యమైన మాస్ ఇమేజ్‌ని అతి చిన్న వయసులోనే సాధించగలిగారు ఎన్టీఆర్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌గా తాతకు తగ్గ మనువడే కాదు.. డాన్స్, యాక్షన్ సీన్స్ విషయంలో తాతను మించే అని మైమరపించాడు. సింహాద్రి చిత్రం తరువాత కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నారు ఎన్టీఆర్. ఆంధ్రావాలా, సాంబ, నాఅల్లుడు, నరసింహుడు, అశోక్ చిత్రాలు వరుసగా ఫ్లాపైనా... నటుడిగా మాత్రం ఎన్టీఆర్ ఫెయిల్ కాలేదు.
  • 6
   హిట్ ఫ్లాప్ సంగతి పక్కనపెడితే.. ఈ తరువాత వచ్చిన రాఖీ చిత్రానికి మహిళా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తిరిగి దర్శకధీరుడు రాజమౌళితో ‘యమదొంగ’తో మరో హిట్ అందుకున్నారు. అనంతరం ‘అదుర్స్’, బృందావ‌నం, బాద్‌షా, టెంప‌ర్, నాన్నకు ప్రేమ‌తో, జ‌న‌తా గ్యారేజ్, జైల‌వ‌కుశ‌, అర‌వింద స‌మేత’ వంటి హిట్లతో ఎన్టీఆర్ మంచి జోరు మీద ఉన్నారు. అయితే అన్ని సినిమా ఒక లెక్క.. త్వరలో రాబోయే ఆర్ ఆర్ ఆర్ మరో లెక్క అన్న మాదిరిగా తన స్నేహితుడు, స్టార్ హీరో రామ్ చరణ్‌తో కలిసి RRR చిత్రంలో నటిస్తున్నారు
  • 7
   ఇక ఎన్టీఆర్ పర్శనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఈ నందమూరి వారసుడు 2011లో మే 5న నార్నె వారి ఇంటికి అల్లుడయ్యాడు. లక్ష్మీ ప్రణీతను వివాహం చేసుకున్న ఎన్టీఆర్‌‌కి అభయ్ రామ్, భార్గవ రామ్ ఇద్దరు కొడుకులు సంతానం. షూటింగ్‌లను పక్కనపెడితే తన భార్య,పిల్లలతో ఎక్కువ టైం కేటాయించడానికి ఇష్టపడతాడు ఎన్టీఆర్
  • 8
   తనని ఎంతో ప్రేమించే తండ్రి హరిక్రిష్ణ చనిపోవడంతో కొన్నాళ్ల పాటు మానసిక వేదనకు గురయ్యారు ఎన్టీఆర్. సినిమా ఫంక్షన్లలో సైతం తండ్రి గుర్తుకు వచ్చినప్పుడల్లా కన్నీళ్లు పెట్టుకుని విలపించారు ఎన్టీఆర్.
  • 9
   వెండితెరపై యంగ్ టైగర్‌గా బాక్సాఫీస్‌ని శాసించిన ఎన్టీఆర్.. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో బుల్లితెరపై జెండా పాతేశారు. బిగ్ బాస్ సీజన్ 1కి హోస్ట్‌గా వ్యవహరించి.. తెలుగు టీవీ చరిత్రలో ఎప్పుడూలేనంత టీఆర్‌పీ రేటింగ్ ‘బిగ్ బాస్’కు వచ్చేలా చేశారు. తన మాటతీరు, వ్యాక్చాతుర్యంతో బిగ్ బాస్ ఆటను వన్ మ్యాన్ షోగా నడిపించారు ఎన్టీఆర్.
  జూనియర్ యన్ టి ఆర్ వ్యాఖ్యలు
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X