CelebsbredcrumbRam Charan Teja
  రామ్ చరణ్ తేజ

  రామ్ చరణ్ తేజ

  Actor/Producer
  Born : 27 Mar 1985
  Birth Place : హైదరాబాద్
  రామ్ చరణ్ తేజ ప్రముఖ తెలుగు సినిమా నటుడు చిరంజీవి కుమారుడు. ఇతను తెలుగు సినిమా నటుడు, నిర్మాతగానే కాక రాంచరణ్ హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ యొక్క ఓనరు. రామ్ చరణ్ తేజ మార్చి 27, 1985 న చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించాడు. ఇతనికి ఇద్దరు సొదరీమణులు శ్రీజ... ReadMore
  Famous For
  రామ్ చరణ్ తేజ ప్రముఖ తెలుగు సినిమా నటుడు చిరంజీవి కుమారుడు. ఇతను తెలుగు సినిమా నటుడు, నిర్మాతగానే కాక రాంచరణ్ హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ యొక్క ఓనరు. రామ్ చరణ్ తేజ మార్చి 27, 1985 న చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించాడు.


  ఇతనికి ఇద్దరు సొదరీమణులు శ్రీజ మరియూ సుష్మిత. జూన్ 14, 2012న ఉపాసన కామినేనిని వివాహమ్ చేసుకున్నాడు. చరణ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2007లో విడుదలైన చిరుత (సినిమా) చిత్రంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యాడు. ఈ చిత్రం విజయవంతం అవ్వడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. ఆ తర్వాత...
  Read More
  • నయనతార మేకింగ్ వీడియో
  • భలే భలే బంజారా ఫుల్ వీడియో సాంగ్
  • ఎత్తర జెండా ఫుల్ వీడియో సాంగ్- ఆర్ ఆర్ ఆర్
  • దోస్తీ ఫుల్ వీడియో సాంగ్ - ఆర్ ఆర్ ఆర్
  • ఆచార్య మూవీ నుంచి ‘భలే భలే బంజారా’ సాంగ్
  • ఆచార్య మూవీ ట్రైలర్
  • 1
   1985 మార్చి 27న చెన్నైలో జన్మించిన రామ్ చరణ్. మెగాస్టార్ నట వారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చిరుత’తో హీరోగా ఎంట్రీ ఇచ్చి మెగా పవర్ స్టార్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
  • 2
   తొలి సినిమా ‘చిరుత’తో తండ్రి తగ్గ తనయుడిగా.. డాన్సుల్లో, ఫైట్స్‌లో చిరంజీవి నట వారసుడు అనిపించుకున్నారు. ఈ సినిమా పూరీ జగన్నాథ్ పుట్టినరోజున విడుదల కావడం విశేషం.
  • 3
   ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌లో నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. నేహా శర్మ కథానాయికగా నటించింది. ఈ చిత్రం మ్యూజికల్‌గా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా అప్పట్లోనే రూ. 25 కోట్ల షేర్ అందుకొని సంచలన విజయం సాధించింది.
  • 4
   ‘చిరుత’ సినిమా క్లైమాక్స్‌ను ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన విధానం. దానికి రామ్ చరణ్ నటన అన్ని కలిపి ఈ సినిమాను బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిపాయి.
  • 5
   రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మగధీర’లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన రామ్ చరణ్. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్‌లో కాల భైరవ పాత్రలో రామ్ చరణ్ నటన అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది.
  • 6
   రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘మగధీర’ అప్ప‌ట్లోనే దాదాపు రూ. 20 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసి రామ్ చ‌ర‌ణ్ కెరీర్‌కు పూల బాట‌లు వేసింది. ఆ త‌ర్వాత రాజ‌మౌళి వ‌చ్చి ఏకంగా రామ్ చ‌ర‌ణ్ బాధ్య‌త తీసుకున్నాడు. మ‌గ‌ధీర సినిమాతో కేవ‌లం ఒకే ఒక్క సినిమా అనుభ‌వం ఉన్న రామ్ చ‌ర‌ణ్ అప్ప‌టి వ‌ర‌కు ఉన్న 75 ఏళ్ల తెలుగు సినిమా చ‌రిత్ర రికార్డుల‌ను తిర‌గ‌రాసాడు. తెలుగు ఇండ‌స్ట్రీలో తొలిసారి 75 కోట్ల మార్క్ అందుకున్న హీరోగా స‌రికొత్త హిస్ట‌రీ క్రియేట్ చేసాడు.
  • 7
   ఆరెంజ్ సినిమాతో న‌టుడిగా నిరూపించుకున్నా.. తొలి ఫ్లాప్ అందుకున్నాడు. అయితే వెంట‌నే ర‌చ్చ‌, నాయ‌క్, ఎవ‌డు లాంటి మాస్ సినిమాల‌తో మ‌ళ్లీ విజ‌యాలు అందుకున్నాడు మెగా వార‌సుడు. కానీ ప్ర‌యోగాలు చేయ‌డ‌నే విమ‌ర్శ‌లు మాత్రం అందుకున్నాడు. మాస్ సినిమాలు.. రొటీన్ క‌థ‌లు చేస్తాడంటూ చ‌ర‌ణ్ కెరీర్‌తో ఆడుకున్న వాళ్లు కూడా ఉన్నారు.
  • 8
   జంజీర్ సినిమాతో హిందీకి వెళ్లి అక్క‌డా విమ‌ర్శ‌లు తెచ్చుకున్నారు. చ‌ర‌ణ్. అలనాటి అమితాబ్ క్లాసిక్‌ను చెడగొట్టాటంటూ విమర్శలు మూటగట్టుకున్నారు. ఆ వెంట‌నే గోవిందుడు అంద‌రివాడేలే అంటూ తొలిసారి ఫ్యామిలీ డ్రామాలో ఒదిగిపోయారు.
  • 9

   బ్రూస్లీ లాంటి ఫ్లాపులు వెంట‌బ‌డినా ధృవ సినిమాతో విజ‌యం అందుకున్నారు. ఇక మూడేళ్ల క్రితం వ‌చ్చిన రంగ‌స్థ‌లం సినిమాతో మ‌రోసారి ఇండ‌స్ట్రీ రికార్డుల‌కు చెక్ పెట్టాడు రామ్ చ‌ర‌ణ్. ఈ సినిమాతో అప్ప‌టి వ‌ర‌కు చ‌ర‌ణ్ న‌ట‌న‌పై ఉన్న అనుమానాల‌న్నీ తీరిపోయాయి. సుకుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రంతో రూ.125 కోట్ల మార్క్ అందుకున్నారు చ‌ర‌ణ్.
  • 10
   హీరోగా 13 సినిమాల్లో నటించిన రామ్ చరణ్ . అంతకు ముందు యేడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించి విమర్శల పాలైయ్యారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ పేరు తీసుకొచ్చినా.. బాక్సాపీస్ దగ్గర సరైన ఫలితం అందుకోలేదు.
  • 11
   రాజమౌళి దర్శకత్వంలో చేస్తోన్న ‘RRR’ సినిమా ‘రౌద్రం రణం రుధిరం’ హీరోగా రామ్ చరణ్‌కు పుట్టినరోజు మందు రాజమౌళి మంచి కానుక ఇచ్చారనే చెప్పాలి. ఈ సినిమా విడుదలైన తొలిరోజే అన్ని రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. అంతేకాదు తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 235 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి భారతీయ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సంచనాలకు వేదికగా నిలిచింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, అజయ్ దేవ్‌గణ్‌లతో చరణ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. .
  • 12
   ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. హీరోగా రామ్ చరణ్‌కు 15వ సినిమా. ఈ సినిమాకు సర్కారోడు అనే టైటిల్ పరిశీలన ఉంది. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 14 యేళ్ల కెరీర్‌లో దాదాపు 14 చిత్రాల్లో నటించిన రామ్ చరణ్.. మరో మూడు చిత్రాలు లైన్‌లో ఉన్నాయి.
  • 13
   శంకర్ మూవీ తర్వాత గౌతమ్ తిన్ననూరితో పాటు శ్యామ్ సింగరాయ్ దర్శకులను లైన్‌లో పెట్టారు. ఇక గౌతమ్ తిన్ననూరితో చేయబోయే సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ప్రభాస్‌కు చెందిన యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
  • 14

   తండ్రి చిరంజీవితో కలిసి ‘మగధీర’, బ్రూస్లీ’, ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాల్లో కాసేపు స్క్రీన్ షేర్ చేసుకున్న రామ్ చరణ్ . ఇపుడు ‘ఆచార్య’లో పూర్తి స్థాయిలో కలిసి నటించబోతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానే ఎదురు చూస్తున్నారు
  • 15
   కెరీర్ మొదట్లో ఒక మూసలో సినిమాలు చేసిన.. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముందుగా ఈ మెగా వారసుడు న‌టుడే కాద‌న్నారు.. కానీ ఇప్పుడు న‌టుడంటే ఇలా ఉంటాడురా అనిపించారు. చిరంజీవికి త‌గ్గ త‌న‌యుడు కాదు.. ప్ర‌యోగాలంటే భ‌య‌ప‌డ‌తాడు అన్నారు.. కానీ ఇప్పుడు కొత్త క‌థ‌లు ఉంటే ఆయ‌న రెడీ అంటూ ద‌ర్శ‌కులే ఎగ‌బ‌డుతున్నారు
  • 16
   కెరీర్‌ మొదట్లో ఎక్స్‌ప్రెష‌న్స్ ఇవ్వ‌లేడ‌ని హేళన చేసారు.. కానీ ‘రంగస్థలం’ అనే సినిమాతోనే త‌నెంత గొప్ప న‌టున్నో అంద‌రికీ చూపించారు. బ్యాడ్ బాయ్ అంటూ విమ‌ర్శించారు.. కానీ ఇప్పుడు ఎంత మంచివాడో అంటూ నెత్తిన పెట్టుకుంటున్నారు. అలా తన ఇమేజ్ మార్చుకున్నారు
  • 17
   తండ్రి నటవారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రామ్ చరణ్. ఇలా తనలో ఉన్న ఒక్కో మైన‌స్ లెక్క‌లేసుకుంటూ వాటినే త‌న‌కు ప్ల‌స్‌లుగా మార్చుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్.
  • 18
   తండ్రి హీరోగా తన ఓన్ ప్రొడక్షన్ హౌస్ కొణిదెల ప్రొడక్షన్స్ స్థాపించి ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో నిర్మాతగా మారిన రామ్ చరణ్ . ఈ పినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ కూడా ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది.
  • 19
   తన కుటుంబ సభ్యులైన తండ్రి చిరంజీవి తల్లి సురేఖ, భార్య ఉపాసనతో రామ్ చరణ్. సినిమాలతో పాటు రామ్ చరణ్ తన కుటుంబానికి మంచి సమయం కేటాయిస్తారు. అలా ఫ్యామిలీ మ్యాన్‌గా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్నారు.
  రామ్ చరణ్ తేజ వ్యాఖ్యలు
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Yes No
  Settings X