రూలర్ సినిమా యాక్షన్, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నందమూరి బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, వేదిక, భూమిక చావ్లా, ప్రకాష్ రాజ్, నధియ, ఝాన్సీ, నాజర్, సప్తగిరి, రఘుబాబు, ధన్ రాజ్, శ్రీనివాస్ రెడ్డి, జయసుధ, నాగినీడు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కే యస్ రవికుమార్ వహించారు, నిర్మాత సి కళ్యాణ్ నిర్మించారు. సంగీతం చిరంతన్ భట్ అందించారు.
కథ
ఉత్తరప్రదేశ్‌లో క్రైమ్ రేట్ పెరుగుతోందని, వాటికి ఆకలే కారణమని అది తగ్గించాలని మంత్రి వీరేంద్ర నాథ్ ఠాకూర్ (ప్రకాశ్ రాజ్) ప్రభుత్వానికి సలహా ఇస్తాడు. ఈ క్రమంలో అక్కడి వారికి వ్యవసాయాన్ని నేర్పి, ఆ ప్రాంతాన్ని సస్యశామలం చేసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి కొంతమంది రైతులను ఝాన్నీ జిల్లాకు తీసుకొస్తారు. వ్యవసాయం చేసుకునేందుకు ఐదు వేల ఎకరాల స్థలాన్ని వారికి ఇస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీకి వెళ్లిన రైతుల పరిస్థితి ఏమైంది? సాఫ్ట్‌వేర్ రంగాన్ని ఏలుతున్న సరోజిని దేవీ (జయసుధ) అతని కుమారుడు అర్జున్ ప్రసాద్ (బాలకృష్ణ)కు ఆ రైతులకు సంబందం ఏంటి? మంత్రి వీరేంద్ర నాథ్ ఠాకూర్ తమ్ముడు భవానీ నాథ్ ఠాకూర్(పరాగ్ త్యాగీ) చేసిన అకృత్యాలేంటి? ఈ కథలో ధర్మ ఎవరు? అతని గతం ఏంటి? అన్న ప్రశ్నలకు సమాధానమే రూలర్.