రన్ రాజా రన్ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వానంద్, సీరత్‌కపూర్, అడివి శేష్, సంపత్, జయప్రకాశ్‌రెడ్డి, వెన్నెల కిశోర్, అలీ, కోట శ్రీనివాసరావు, విద్యుల్లేఖ రామన్, అజయ్ ఘోష్ తదితరులు ముక్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సుజీత్ నిర్వహించారు మరియు నిర్మాతలు: వి.వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం: ఘిబ్రాన్ ఎం. స్వరాలు సమకుర్చారు.
కథ
కథ విషయానికొస్తే....హైదరాబాద్ నగరంలో ఓ ముఠా చేసే కిడ్నాపులు సంచలనం సృష్టిస్తుంటాయి. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసి కిడ్నాపర్స్‌ను పట్టుకునే బాధ్యత కమీషనర్ దిలీప్ (సంపత్)కు అప్పగిస్తారు. మరో వైపు చాలా బ్రేకప్స్ అయిన రాజా హరిశ్చంద్ర ప్రసాద్ (శర్వానంద్) కమీషనర్ కూతురు ప్రియ(సీరత్ కపూర్)ను ప్రేమిస్తాడు. కమీషనర్ దిలీప్ కుమార్‌కు వీరి ప్రేమ ఇష్టం లేకున్నా ఇష్టమున్నట్లు నటిస్తాడు. కానీ కిడ్నాప్ డ్రామా ఆడాలని మెలిక పెడతాడు. రాజా కూడా ఒప్పుకున్నట్లు నటిస్తాడు. వీరి లవ్ స్టోరీకి, కిడ్నాప్ ముఠాకి సంబంధం ఏమిటి? రాజా ఎలాంటి ట్విస్ట్ లు ఇచ్చాడు, సంపత్ ఏం చేసాడు అనేది తెరపై చూడాల్సిందే.