ఆర్ఎక్స్ 100 (2018)
Release date
12 Jul 2018
genre
ఆర్ఎక్స్ 100 స్టోరి
ఆర్ఎక్స్ 100 సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్, రావు రమేష్, సింధూరపువ్వ రామ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అజై భూపతి వహించారు మరియు నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం చైతన్ భరద్వాజ్ అందించారు.
కథ
శివ (కార్తికేయ) తల్లిదండ్రుల లేని అనాథ. డాడీ (సింధూరపువ్వు రాంకీ) సంరక్షణలోపెరిగి పెద్దవుతాడు. డాడీ గ్రూప్లో కీలక సభ్యుడిగా ఉంటాడు. గ్రామ జెడ్పీటీసీ విశ్వనాథం ( రావు రమేష్)కు అండగా ఉంటారు. హుషారుగా, అమాయకంగా ఉండే శివను విశ్వనాథం కూతురు ఇందు (పాయల్ రాజ్పుత్) ప్రేమలోకి దింపుతుంది. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన శివ ఆమె ప్రపంచంగా జీవిస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోతుంది.
ఇందూకు పెళ్లి అయిందని తెలిసినా ఆమె జ్హాపకాల్లోనే ఎందుకు బతికాడు. ఇందు కోసం మూడేళ్లు ఎదురు చూసిన శివకు ఆమె ప్రేమ దక్కిందా? ఇష్టంగా ప్రేమించిన శివను ఇందు ఎందుకు దూరం చేసుకొన్నది? చివర్లో ఊహించని విధంగా ఇందు గురించి శివ ఓ విషయాన్ని తెలుసుకొంటుంది. ఆ ట్విస్టు వల్ల సినిమా క్లైమాక్స్ ఎలాంటి మలుపులు తిరిగింది అనే ప్రశ్నలకు సమాధానమే RX 100 చిత్ర కథ.
**Note:Hey! Would you like to share the story of the movie ఆర్ఎక్స్ 100 with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు