X
సాహసం శ్వాసగా సాగిపో
Romance | Thriller | 11 Nov 2016 | U/A | 154 Mins
Telugu

సాహసం శ్వాసగా సాగిపో స్టోరీ

సాహసం శ్వాసగా సాగిపో సినిమా రోమ్యాంటిక్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ చైతన్య, మంజిమ, సతీష్ కృష్ణ, రాణ దగ్గుబాటి, బాబ సెహ్గల్ తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం గౌతమ్ మీనన్ నిర్వహించారు మరియు నిర్మాత రెశ్మ ఘటాల నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎ ఆర్ రెహమాన్ స్వరాలు సమకుర్చరు. 

కథ

సినిమాలంటే విపరీతమైన ఇష్టం ఉన్న లీలా (మంజిమ మోహన్‌) వైజాగ్‌కి చెందిన తన ప్రెండ్ మైత్రేయితో కలిసి స్క్రిప్ట్‌ రైటర్‌గా చిత్ర పరిశ్రమలో స్థిరపడాలని ప్లాన్‌ చేస్తుంది. కొన్ని రోజులు గడిపేందుకు మైత్రేయి ఇంటికి వస్తుంది. అక్కడే మైత్రేయి సోదరుడైన రజనీకాంత్‌(నాగచైతన్య)కి దగ్గరవుతుంది. రజనీకాంత్ మురళీధర్ (నాగచైతన్య).. ఇంజనీరింగ్ పూర్తి చేసి సరైన ఉద్యోగం రాకపోవటంతో ఎంబిఏ చేస్తూ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటాడు. ఏదైనా మంచి ఆఫర్ వచ్చేవరకూ ఖాళీగానే కాలం వెళ్ళదీయాలనుకొని వెయిట్ చేస్తున్న సమయంలో తన చెల్లెలి కాలేజ్ ఫంక్షన్ లో లీలా సత్యమూర్తి(మంజిమా మోహన్) అనే అమ్మాయిని చూసి పడిపోతాడు. ఆ తర్వాత ఆమెను పడేయాలని ఫిక్స్ అవుతాడు. ఎలా పడేయాలని అనుకుంటున్న సమయంలో ... తను ఇష్టపడ్డ లీల.. కోర్సు చేయటం కోసం తన చెల్లితో కలిసి తన ఇంట్లోనే ఉండటంతో ఆనందపడిపోతాడు. కొద్ది రోజుల్లోనే లీలాతో రజనీకాంత్ కు మంచి పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారినా చెప్పడు..రజనీకాంత్‌కు బైక్‌పై ప్రయాణమంటే చాలా ఇష్టం. కన్యాకుమారికి బైక్‌పై వెళ్లాలనుకొంటాడు. తాను కన్యాకుమారిలో సూర్యోదయం చూడటానికి బైక్ మీద వెళుతున్న విషయం లీలాతో చెప్తాడు రజనీకాంత్. లీలా కూడా ప్రయాణమవుతుంది. ఈ జర్నిలోనే వీరి జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. ఇద్దరూ కన్యాకుమారి వెళ్లి తిరిగొచ్చే సమయంలో రోడ్డు ప్రమాదానికి గురవుతారు. ఇక తను బతకనేమో అనే భయంతో లీలతో తాను ప్రేమిస్తున్న విషయం చెప్పేస్తాడు రజనీకాంత్. తరువాత కళ్లు తెరిచే చూసేసరికి హాస్పిటల్ లో ఉంటాడు. ప్రక్కన లీల ఉండదు. అక్కడ ఏం జరుగుతుందంటే.. హాస్పటిల్ లో రజనీకాంత్‌ని చేర్పించిన లీలా.. మహారాష్ట్రలో ఉన్న తన అమ్మానాన్నలపై జరిగిన హత్యాయత్నం గురించి తెలుసుకొని అక్కడికి వెళ్లిపోతుంది. మూడు రోజుల తరువాత హస్పిటల్ కు ఫోన్ చేసిన లీలా, తమ కుటుంబం ప్రమాదంలో ఉందని, బైక్ యాక్సిడెంట్ కూడా తనను చంపాడానికి కావాలని చేయించిందే అని చెపుతుంది. తాను, లీలా కన్యాకుమారి నుంచి తిరిగి వస్తుండగా జరిగింది ప్రమాదం కాదని, లీలాని అంతం చేయాలనే పథకం తెలుసుకున్న రజనీకాంత్... వెంటనే ఆమెకు తోడుగా ఉండటానికి ఆమె ఊరు మహారాష్ట్ర బయిలుదేరతాడు. అప్పటికే లీలా తల్లిదండ్రుల మీద హత్యా ప్రయత్నం జరగటంలో వాళ్లు హాస్పిటల్ లో ఉంటారు. రజనీకాంత్ ... అక్కడ చేరుకున్న తరువాత మరోసారి లీలా, ఆమె కుటుంబం మీద ఎటాక్ జరుగుతుంది. మొదటి అప్పుడు చైతూ కాపాడిన తరువాత జరిగిన ఎటాక్ లో లీలా కుటుంబంతో పాటు రజనీకాంత్ ఫ్రెండ్ మహేష్ కూడా చనిపోతాడు. ఆ ఎటాక్ చేసిందెవరు? లీలాపై వారెందుకు దాడి చేశారు? ఇంతకీ లీలాని చంపాలనుకొన్నది ఎవరు? రజనీకాంత్‌.. మహేష్‌గా ఎలా మారాడు? దీనికి పోలీసులు కూడా ఎందుకు సహకరిస్తున్నారు..? లాంటి విషయాలన్ని తెలుసుకోవాలనుకుంటాడు రజనీకాంత్. వీటన్నింటిని తెలుసుకుని రజనీ, లీలాలు ఎలా ఎదుర్కున్నారన్నదే సినిమా. తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+