X
తెలుగు » సినిమాలు » సాహసం శ్వాసగా సాగిపో
సాహసం శ్వాసగా సాగిపో

సాహసం శ్వాసగా సాగిపో

Romance | Thriller | 11 Nov 2016 | U/A | 154 Mins
Telugu

2.6 /5 Users

2.5 /5 Filmibeat

సాహసం శ్వాసగా సాగిపో స్టోరీ

సాహసం శ్వాసగా సాగిపో సినిమా రోమ్యాంటిక్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ చైతన్య, మంజిమ, సతీష్ కృష్ణ, రాణ దగ్గుబాటి, బాబ సెహ్గల్ తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం గౌతమ్ మీనన్ నిర్వహించారు మరియు నిర్మాత రెశ్మ ఘటాల నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎ ఆర్ రెహమాన్ స్వరాలు సమకుర్చరు.  కథ సినిమాలంటే విపరీతమైన ఇష్టం ఉన్న లీలా (మంజిమ మోహన్‌) వైజాగ్‌కి చెందిన తన ప్రెండ్ మైత్రేయితో కలిసి స్క్రిప్ట్‌ రైటర్‌గా చిత్ర పరిశ్రమలో స్థిరపడాలని ప్లాన్‌ చేస్తుంది. కొన్ని రోజులు గడిపేందుకు మైత్రేయి ఇంటికి వస్తుంది. అక్కడే మైత్రేయి సోదరుడైన రజనీకాంత్‌(నాగచైతన్య)కి దగ్గరవుతుంది. రజనీకాంత్ మురళీధర్ (నాగచైతన్య).. ఇంజనీరింగ్ పూర్తి చేసి సరైన ఉద్యోగం రాకపోవటంతో ఎంబిఏ చేస్తూ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటాడు. ఏదైనా మంచి ఆఫర్ వచ్చేవరకూ ఖాళీగానే కాలం వెళ్ళదీయాలనుకొని వెయిట్ చేస్తున్న సమయంలో తన చెల్లెలి కాలేజ్ ఫంక్షన్ లో లీలా సత్యమూర్తి(మంజిమా మోహన్) అనే అమ్మాయిని చూసి పడిపోతాడు. ఆ తర్వాత ఆమెను పడేయాలని ఫిక్స్ అవుతాడు. ఎలా పడేయాలని అనుకుంటున్న సమయంలో ... తను ఇష్టపడ్డ లీల.. కోర్సు చేయటం కోసం తన చెల్లితో కలిసి తన ఇంట్లోనే ఉండటంతో ఆనందపడిపోతాడు. కొద్ది రోజుల్లోనే లీలాతో రజనీకాంత్ కు మంచి పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారినా చెప్పడు..రజనీకాంత్‌కు బైక్‌పై ప్రయాణమంటే చాలా ఇష్టం. కన్యాకుమారికి బైక్‌పై వెళ్లాలనుకొంటాడు. తాను కన్యాకుమారిలో సూర్యోదయం చూడటానికి బైక్ మీద వెళుతున్న విషయం లీలాతో చెప్తాడు రజనీకాంత్. లీలా కూడా ప్రయాణమవుతుంది. ఈ జర్నిలోనే వీరి జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. ఇద్దరూ కన్యాకుమారి వెళ్లి తిరిగొచ్చే సమయంలో రోడ్డు ప్రమాదానికి గురవుతారు. ఇక తను బతకనేమో అనే భయంతో లీలతో తాను ప్రేమిస్తున్న విషయం చెప్పేస్తాడు రజనీకాంత్. తరువాత కళ్లు తెరిచే చూసేసరికి హాస్పిటల్ లో ఉంటాడు. ప్రక్కన లీల ఉండదు. అక్కడ ఏం జరుగుతుందంటే.. హాస్పటిల్ లో రజనీకాంత్‌ని చేర్పించిన లీలా.. మహారాష్ట్రలో ఉన్న తన అమ్మానాన్నలపై జరిగిన హత్యాయత్నం గురించి తెలుసుకొని అక్కడికి వెళ్లిపోతుంది. మూడు రోజుల తరువాత హస్పిటల్ కు ఫోన్ చేసిన లీలా, తమ కుటుంబం ప్రమాదంలో ఉందని, బైక్ యాక్సిడెంట్ కూడా తనను చంపాడానికి కావాలని చేయించిందే అని చెపుతుంది. తాను, లీలా కన్యాకుమారి నుంచి తిరిగి వస్తుండగా జరిగింది ప్రమాదం కాదని, లీలాని అంతం చేయాలనే పథకం తెలుసుకున్న రజనీకాంత్... వెంటనే ఆమెకు తోడుగా ఉండటానికి ఆమె ఊరు మహారాష్ట్ర బయిలుదేరతాడు. అప్పటికే లీలా తల్లిదండ్రుల మీద హత్యా ప్రయత్నం జరగటంలో వాళ్లు హాస్పిటల్ లో ఉంటారు. రజనీకాంత్ ... అక్కడ చేరుకున్న తరువాత మరోసారి లీలా, ఆమె కుటుంబం మీద ఎటాక్ జరుగుతుంది. మొదటి అప్పుడు చైతూ కాపాడిన తరువాత జరిగిన ఎటాక్ లో లీలా కుటుంబంతో పాటు రజనీకాంత్ ఫ్రెండ్ మహేష్ కూడా చనిపోతాడు. ఆ ఎటాక్ చేసిందెవరు? లీలాపై వారెందుకు దాడి చేశారు? ఇంతకీ లీలాని చంపాలనుకొన్నది ఎవరు? రజనీకాంత్‌.. మహేష్‌గా ఎలా మారాడు? దీనికి పోలీసులు కూడా ఎందుకు సహకరిస్తున్నారు..? లాంటి విషయాలన్ని తెలుసుకోవాలనుకుంటాడు రజనీకాంత్. వీటన్నింటిని తెలుసుకుని రజనీ, లీలాలు ఎలా ఎదుర్కున్నారన్నదే సినిమా. తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

సాహసం శ్వాసగా సాగిపో కాస్ట్ & క్రూ

సాహసం శ్వాసగా సాగిపో సిబ్బంది సమాచారం

దర్శకత్వం గౌతమ్ మీనన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎ ఆర్ రెహమాన్
నిర్మాత రెశ్మ ఘటాల
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సాహసం శ్వాసగా సాగిపో విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
‘ద గాడ్‌ఫాదర్‌' చిత్రం ప్రేరణతో కథ రాసుకొన్నట్టు టైటిల్‌ కార్డ్స్‌లో వేశారు గౌతమ్‌మేనన్‌. హీరో పాత్రని ఈ కథలో హీరోయిన్ చేసారు. కానీ వర్మ ఇప్పటికే చాలా సార్లు ఇదే కథని వండి వార్చేయటంతో...పెద్ద కొత్తగా అనిపించదు. సినిమాలో హీరోయిన్ ని ఎదుకు విలన్స్ చంపాలనుకుంటున్నారనే విషయం చివరి నిముషం వరకూ బయిటపెట్టకుండా స్క్రీన్ ప్లే చేసారు గౌతమ్ మీనన్. అయితే అదే విసుగుతెప్పించింది. ఎందుసేపూ వన్ సైడ్ వార్ లాగ అనిపిస్తుంది. అలాగే లాస్ట్ టెన్ మినిట్స్ లో పజిల్ మొత్తం కొన్ని డైలాగ్స్ లో రివీల్ చేసేయటం కూడా ఆకట్టుకోదు. వాస్తవానికి థ్రిల్లింగ్‌ ఫార్మెట్ లో స్క్రీన్ ప్లే చేసిన ఈ కథకి ఓ రేంజి విలనిజం అవసరం. కానీ అది కూడా బలంగా ఏమీ పండలేదు. చాలా వీక్ గా అనిపించి, హీరోకు ఛాలెంజ్ లాగ కనపడదు. ఆ పాత్రలో బాబా సెహగల్‌ బాగానే నటించాడు కానీ... ఆ పాత్రలో విలనిజం మాత్రం పండకపోవటం మైనస్ అయ్యింది. ఫస్టాఫ్ అంతా గౌతమ్ మీనన్ తను మాస్టరీ చేసిన రొమాన్స్‌ ఎపిసోడ్స్ తో, రోడ్ ట్రిప్‌తో సరదాగా నడిపేసాడు, అలాగే ఇంటర్వెల్‌లో ట్విస్ట్ వేసి కథని లాక్ చేసాడు. అయితే అక్కణ్ణుంచి సినిమానంతా ఒక యాక్షన్ థ్రిల్లర్‌గా మారిపోయి..జానర్ ఛేంజ్ అయ్యి...ఇబ్బందిగా అనిపించింది. అలాగే.. ఫస్టాఫ్‌లో గౌతమ్ మీనన్ స్టైల్ మేకింగ్, రొమాంటిక్ సీన్స్ నుంచి పుట్టే ఫన్‌తో చాలా బాగుంది. స్లో నేరేషన్, వెంట వెంటనే వచ్చే పాటలు ఫస్ట్ హాప్ లో కాస్త బోర్ కొట్టిస్తాయి. యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారిని సెంకడ్ హాఫ్ బాగుందనిపిస్తుంది. అయితే పూర్తి స్దాయి సీరియస్ నెస్ తో సాగుతుంది. అలాగే...తాను... నేను, చకోరి... పాటలు బాగున్నాయి. వెళ్లిపోమాకే పాట బాగున్నప్పటికీ అది ప్లేస్‌మెంట్‌ సరిగ్గా కుదర్లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమా స్థాయిని పెంచాడు. సెకండాఫ్ లో మరింత జాగ్రత్తలు తీసుకుని ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేదనిపిస్తుంది.

సాహసం శ్వాసగా సాగిపో సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

సాహసం శ్వాసగా సాగిపో

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+