twitter

    సాహో స్టోరి

    సాహో సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రభాస్, శ్రద్దా కపూర్, సంపత్ రాజ్, నీల్ నితిన్ ముఖేష్, సి వి ఎల్ నరసింహా రావు, మందిర బేడి, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, లాల్, మహేష్ మంజ్రెకర్, ఆదిత్య శ్రీవస్తావ, నరేంద్ర జా, అమీ జాక్సన్, ఎవెల్యన్ శర్మ, నటాషియా మల్తె, శ్రాబంతి చటర్టీ, వెన్నెల కిశోర్, చుంకీ పాండే, మురళీ శర్మ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సుజిత్ వహిస్తున్నారు మరియు నిర్మాతలు వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శంకర్ ఎహసన్ లాల్ స్వరాలు అందించారు.

    సాహో మూవీ స్టోరీ 

    రాయ్ ( జాకీ ష్రాఫ్), దేవరాజ్ (చంకీ పాండే) గ్యాంగ్‌స్టర్ గ్రూపుల మధ్య ఆధిపత్యం కొనసాగుతుంటుంది. ఆధిపత్య పోరులో రాయ్ అనూహ్యంగా ఓ యాక్సిడెంట్‌లో మరణిస్తాడు. రాయ్ స్థానంలో ఆయన కుమారుడు విశ్వక్ (అరుణ్ విజయ్) బాధ్యతలు చేపడుతాడు. ఆ క్రమంలో 2 లక్షల కోట్లు దోపిడి జరుగుతుంది. ఆ కేసును దర్యాప్తు చేయడానికి అశోక్ చక్రవర్తి (ప్రభాస్) ఆఫీసర్‌ వస్తాడు. అదే కేసును టేకప్ చేసిన అమృతా నాయర్ (శద్దా కపూర్)తో ప్రేమలో పడుతాడు. ఆ కేసును ఛేదించేందుకు అవసరమైన బ్లాక్ బాక్స్‌ను చేజిక్కించుకోనేందుకు ప్లాన్స్ వేస్తారు.

    అశోక్ చక్రవర్తిగా అడుగు పెట్టిన ఆఫీసర్ సాహోగా ఎందుకు మారాడు? సాహో ముసుగులో బ్లాక్ బాక్స్‌ను చేజిక్కించుకొనేందుకు ఎందుకు ప్రయత్నించాడు. ఈ కథలో నీల్ నితిన్ ముఖేష్ పాత్ర ఏంటి? రాయ్ మరణం వెనుక కారణాలు ఏమిటి? బ్లాక్ బాక్స్ కోసం దేవరాజ్ ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ఈ కథలో అసలు దొంగ ఎవరు? అసలు పోలీసు ఎవరు? రాయ్ వారసుడిగా ఎవరు నిలిచారు? అమృత, సాహో ప్రేమకు ఎలాంటి ముగింపు దొరికింది? అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే సాహో కథ.


    యాక్షన్ సీన్స్

    ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని సీన్స్.. యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని చేప్తున్నారు.భారీగా సినిమాకి ఖర్చు చేశారు, ఖర్చు చేసిన ప్రతి పైసా తెర మీద స్పష్టంగా కనిపిస్తుందని సినీవర్గాలు అంటున్నాయి.

    సినిమా షూటింగ్ 

    'సోహో’ చిత్రం షూటింగ్‌ ఆస్ట్రియా, అబుదాబీ, ఇటలీ, ఇండియాలో జరిగింది. వందలాది సెట్స్‌ వేశాం. వీటిల్లో ‘వాజీ’ సెట్‌ కళా దర్శకుడు సాబూ సిరిల్‌ అద్భుత సృష్టికి నిదర్శనం. ‘వాజీ’ అనే నగర నేపథ్యంలో జరిగే కథ కనుక రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘వాజీ’ సెట్‌ వేశాం. అక్కడ బిల్డింగులు, వాహనాలు కొత్త తరహాలో ఉంటాయి. రెగ్యులర్‌కు భిన్నంగా, ప్రస్తుత కాలానికి తగ్గట్టుగానే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్టయిలిష్‌ యాక్షన్‌ అండ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది.







    **Note:Hey! Would you like to share the story of the movie సాహో with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X