X
సాహో

సాహో

Action | 30 Aug 2019 | U/A | 171 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

సాహో స్టోరీ

సాహో సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రభాస్, శ్రద్దా కపూర్, సంపత్ రాజ్, నీల్ నితిన్ ముఖేష్, సి వి ఎల్ నరసింహా రావు, మందిర బేడి, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, లాల్, మహేష్ మంజ్రెకర్, ఆదిత్య శ్రీవస్తావ, నరేంద్ర జా, అమీ జాక్సన్, ఎవెల్యన్ శర్మ, నటాషియా మల్తె, శ్రాబంతి చటర్టీ, వెన్నెల కిశోర్, చుంకీ పాండే, మురళీ శర్మ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సుజిత్ వహిస్తున్నారు మరియు నిర్మాతలు వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శంకర్ ఎహసన్ లాల్ స్వరాలు అందించారు. సాహో మూవీ స్టోరీ  రాయ్ ( జాకీ ష్రాఫ్), దేవరాజ్ (చంకీ పాండే) గ్యాంగ్‌స్టర్ గ్రూపుల మధ్య ఆధిపత్యం కొనసాగుతుంటుంది. ఆధిపత్య పోరులో రాయ్ అనూహ్యంగా ఓ యాక్సిడెంట్‌లో మరణిస్తాడు. రాయ్ స్థానంలో ఆయన కుమారుడు విశ్వక్ (అరుణ్ విజయ్) బాధ్యతలు చేపడుతాడు. ఆ క్రమంలో 2 లక్షల కోట్లు దోపిడి జరుగుతుంది. ఆ కేసును దర్యాప్తు చేయడానికి అశోక్ చక్రవర్తి (ప్రభాస్) ఆఫీసర్‌ వస్తాడు. అదే కేసును టేకప్ చేసిన అమృతా నాయర్ (శద్దా కపూర్)తో ప్రేమలో పడుతాడు. ఆ కేసును ఛేదించేందుకు అవసరమైన బ్లాక్ బాక్స్‌ను చేజిక్కించుకోనేందుకు ప్లాన్స్ వేస్తారు. అశోక్ చక్రవర్తిగా అడుగు పెట్టిన ఆఫీసర్ సాహోగా ఎందుకు మారాడు? సాహో ముసుగులో బ్లాక్ బాక్స్‌ను చేజిక్కించుకొనేందుకు ఎందుకు ప్రయత్నించాడు. ఈ కథలో నీల్ నితిన్ ముఖేష్ పాత్ర ఏంటి? రాయ్ మరణం వెనుక కారణాలు ఏమిటి? బ్లాక్ బాక్స్ కోసం దేవరాజ్ ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ఈ కథలో అసలు దొంగ ఎవరు? అసలు పోలీసు ఎవరు? రాయ్ వారసుడిగా ఎవరు నిలిచారు? అమృత, సాహో ప్రేమకు ఎలాంటి ముగింపు దొరికింది? అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే సాహో కథ. యాక్షన్ సీన్స్ ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని సీన్స్.. యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని చేప్తున్నారు.భారీగా సినిమాకి ఖర్చు చేశారు, ఖర్చు చేసిన ప్రతి పైసా తెర మీద స్పష్టంగా కనిపిస్తుందని సినీవర్గాలు అంటున్నాయి. సినిమా షూటింగ్  'సోహో’ చిత్రం షూటింగ్‌ ఆస్ట్రియా, అబుదాబీ, ఇటలీ, ఇండియాలో జరిగింది. వందలాది సెట్స్‌ వేశాం. వీటిల్లో ‘వాజీ’ సెట్‌ కళా దర్శకుడు సాబూ సిరిల్‌ అద్భుత సృష్టికి నిదర్శనం. ‘వాజీ’ అనే నగర నేపథ్యంలో జరిగే కథ కనుక రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘వాజీ’ సెట్‌ వేశాం. అక్కడ బిల్డింగులు, వాహనాలు కొత్త తరహాలో ఉంటాయి. రెగ్యులర్‌కు భిన్నంగా, ప్రస్తుత కాలానికి తగ్గట్టుగానే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్టయిలిష్‌ యాక్షన్‌ అండ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది.
Read More

సాహో కాస్ట్ & క్రూ

సాహో సిబ్బంది సమాచారం

దర్శకత్వం సుజీత్
సినిమాటోగ్రఫీ ఆర్ మధి
సంపాదకుడు శ్రీకర్ ప్రసాద్
సంగీతం గిబ్రాన్, తనీష్క్ బాగ్చి, గురు రంధవా
నిర్మాత ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సాహో విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
భారతీయ సినిమా తెరపై ఇప్పటి వరకు చూడని సరికొత్త, హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సాహో. టాలీవుడ్, బాలీవుడ్ స్థాయిని మించి అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిన చిత్రం సాహో. ప్రభాస్ హై ఓల్టేజ్ ఫెర్ఫార్మెన్స్, శ్రద్ధాకపూర్ గ్లామర్, ఫెర్ఫార్మెన్స్, డైరెక్టర్ సుజిత్ టేకింగ్ సినిమాకు ప్లస్ పాయింట్స్. కథ లేకుండా కథనంపైనే ఆధారపడటం సినిమాకు ఉన్న ఏకైక బలహీనత. ఏది ఏమైనా సాహో వెండితెరపైన ఓ సూపర్ హీరో చిత్రం. దిగువ తరగతి ప్రేక్షకులకు నచ్చితే ఈ సినిమా కమర్షియల్‌గా కూడా భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉంది.

సాహో ట్రైలర్

Video Thumbnail

సాహో సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

సాహో

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+