సలార్ సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రభాస్, శృతి హాసన్, జగపతి బాబు,పృధ్విరాజ్ సుకుమారన్, మధు గురుస్వామి, ఈశ్వరీ రావు, జగపతి బాబు, యష్, అభినవ్ రాజ్ సింగ్, శ్రేయ రెడ్డి, శరన్ శక్తి, శ్రేయ భార్గవ, కెర్వుడ్ కెనాల్ తదితరులు నటించారు. కె జి యఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. నిర్మాత విజయ్ కిర గందుర్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రానున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. రవి బస్రూర్ సంగీతం అందించారు.
టీజర్
సలార్ టీజర్ చూస్తుంటే కేజీఎఫ్ ను మించిపోయేలా ప్రభాస్‌కు ఎలివేషన్ ఇచ్చినట్టు అర్థమవుతుంది. సింహం, పులి, చిరుత, ఏనుగు ఇవన్నీ చాలా ప్రమాదకరమైన జంతువులే.. కానీ జురాసిక్ పార్కులో మాత్రం కాదు.. ఎందుకంటే అంటూ డైలాగ్ మధ్యలోనే ఆగిపోవడం.. ఆ తర్వాత పవర్‌ఫుల్ బీజీఎంతో ప్రభాస్‌ను చూపించడం గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ బ్యాక్‌గ్రౌండ్ లో మైనింగ్ ఏరియాలో ఉన్న విజువల్స్ చూస్తుంటే కేజీఎఫ్ సినిమాను మించిపోయేలా సలార్‌ను ప్లాన్ చేసినట్టు అర్థమవుతోంది.
రిలీజ్
సలార్ తొలి భాగం సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేస్తున్నారు
షూటింగ్
సలార్ షూటింగ్ ఫైనల్ స్టేజీలో ఉంది. కేజీఎఫ్ ప్రాంఛైజీతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విజయ్ కిరగందూర్ హోంబ్యానర్ హోంబలే ఫిలిమ్స్ పై సలార్ ను తెరకెక్కిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సలార్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో రెండు పార్టులుగా రాబోతుండటంతో ప్రభాస్.. ఈ రెండింటిలో ఎలా కనిపించబోతున్నాడోనంటూ తెగ ఎక్జయిటింగ్‌కు లోనవుతున్నారు అభిమానులు. ప్రశాంత్ నీల్ సలార్ కోసం భారీ ప్రమోషన్స్ ప్లాన్స్ కూడా రెడీ చేసుకున్నాడని ఇన్‌సైడ్ టాక్.