twitter

    సప్తగిరి ఎల్.ఎల్.బి స్టోరి

    సప్తగిరి ఎల్.ఎల్.బి సినిమా యాక్షన్, కామిడి, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సప్తగిరి, కషిష్ వోహ్రా, సాయికుమార్, శకలక శంకర్, శివప్రసాద్  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం చరణ్ లక్కాకుల వహించారు మరియు నిర్మాత డా కె రవి కిరణ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం విజయ్ బుల్గానిన్ అందించారు. 

    కథ

    చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన సప్తగిరి (సప్తగిరి) న్యాయశాస్త్రం విద్యలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేస్తాడు. గ్రామంలో చోటుచేసుకొన్న ఓ సంఘటనలో తన ప్రతిభను ఉపయోగించి పరిష్కారం చూపుతాడు. జిల్లా కోర్టులో సరైన కేసులు దొరకపోవడంతో తన మరదలు (కశీష్ వోరా)ను ఇచ్చి పెళ్లి చేయడానికి మామ నిరాకరిస్తాడు. ఎలాగైనా పేరు ప్రతిష్ఠలు సంపాదించడమే కాకుండా మరదలి పెళ్లి చేసుకోవడానికైనా కేసులు గెలువాలని అనుకొంటారు. ఆ క్రమంలో హైదరాబాద్‌ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభిస్తాడు. ఐదుగురి మరణానికి కారణమైన హిట్ రన్‌ కేసులో ఏకంగా టాప్ లాయర్ రాజ్‌పాల్‌ (సాయికుమార్)నే ఢీకొంటాడు. కేసు విచారణ సందర్భంగా ఊహించని అంశాలు తెరపైకి వస్తాయి. కారు ప్రమాదంలో ఫుట్‌పాత్‌పైన మరణించింది బిక్షగాళ్లు కాదు రైతులు అనే తెలియడంతో కోర్టు విచారణ కొత్త మలుపు తిరుగుతుంది. పోలీసులు, రాజ్‌పాల్ కుమ్మక్కై ముద్దాయిని కేసు నుంచి తప్పించడానికి ప్లాన్ చేస్తారు. రాజ్‌పాల్‌, పోలీసుల దాడులను సప్తగిరి ఎలా ఎదురించాడు? కారు ప్రమాదంలో రైతులు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? పోలీసులకు సప్తగిరి ఎలా బుద్ది చెప్పాడు? కేసును గెలిచి రాజ్‌పాల్ గర్వాన్ని సప్తగిరి ఎలా అణిచాడు అనే ప్రశ్నలకు సమాధానమే సప్తగిరి LLB కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie సప్తగిరి ఎల్.ఎల్.బి with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X