సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్, శరద్ కేల్కర్, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, కబీర్ దుహాన్ సింగ్, చరణ్ రాజ్, సంజన గిల్రాణి, ఉర్వశి, షకలక శంకర్, నర్సింగ్ యాదవ్, వేణు (జబర్ దస్థ్), రావు రమేష్, పోసాని మురళి కృష్ణ, తనికెళ్ళ భరణి, రఘు బాబు తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె ఎస్ రవింద్ర నిర్వహిస్తున్నారు మరియు నిర్మాత శర్రత్ మారర్ నిర్మించారు ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చరు.
కథ
రత్తన్ పూర్ ప్రాంత రాజకుటుంబానికి చెందిన భైరవ్ సింగ్ (శరద్ కెల్కర్) ఓ కిరాతుకుడు. ఆ ప్రాంతంలోని మైనింగ్ ని చేజిక్కించుకోవటం కోసం...పంట భూములను అక్రమంగా ఆక్రమించుకుని రైతులును ఇబ్బందులు పెడుతూ...ఊరిని నాశనం చేస్తూంటాడు. మరో ప్రక్క అక్కడ రాజ సంస్థానంలో అప్పుల్లో కూరుకుపోయి.. ఆ సంస్థానానికి సంబందించిన ఛారిటిలు నడపటం కోసం...తమ ఇంట్లో వస్తువులను అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ఆ కుటుంబీకులు ఉంటారు. తమ రాజమహల్ ని ఓ హోటల్ వారికి అప్పగించేస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయని ఆ కుటుంబం భావిస్తుంది. అయితే భైరవ్ సింగ్ మాత్రం ఆ ప్రయత్నం ముందుకు సాగనీయడు. అప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ (పవన్ కల్యాణ్) సీఐగాఆ ప్రాంతానికి ట్రాన్సఫర్ పై వస్తాడు. నానా ఇబ్బందుల్లో, దుస్దితిలో ఉన్న రతన్‌పూర్ ని, ఆ రాజకుటుంబాన్ని ఎలా భైరవ్ సింగ్ కబంధ హస్తాల నుంచి కాపాడాడు.. అడుగడుగునా అడ్డుపడే భైరవ్ సింగ్ నుంచి తప్పించుకుంటూ...అక్కడి సమస్యల్ని ఎలా తీర్చాడు అన్నదే సర్దార్ కథ.