X
సర్కారు వారి పాట
Action | 12 May 2022 | U/A | 162 Mins
Telugu

సర్కారు వారి పాట స్టోరీ

సర్కారు వారి పాట సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబుకీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, మహేష్ మంజ్రేకర్, రవి ప్రకాష్, నదియా, అజయ్   తదితరులు నటించారు. పరశురామ్ దర్శకత్వం వహించారు.  ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ తో పాటు GMB ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం థమన్ ఎస్ అందించారు.


కథ

చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన మహేష్ (మహేష్ బాబు) అనాధాశ్రమంలో పెరిగి అమెరికాలో వడ్డీ వ్యాపారీగా సెటిల్ అవుతాడు. బాకీ తీర్చకుంటే మహేష్ ముక్కుపిండి డబ్బు వసూలు చేస్తాడు. డబ్బు విషయంలో కఠినంగా ఉండే మహేష్.. ఎంపీ రాజేంద్రనాథ్ (సముద్రఖని) కూతురు కళావతి (కీర్తి సురేష్)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. జూదానికి వ్యసనమై అప్పుల్లో కూరుకుపోయిన కళావతి తన అవసరాల కోసం మహేష్‌ను మభ్యపెట్టి అప్పుగా డబ్బు తీసుకొంటుంది. కానీ ఆమె నిజ స్వరూపం తెలిసిన మహేష్ డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తాడు. మహేష్‌ను కళావతి ఎలాంటి మాటలతో మభ్యపెట్టి బుట్టలో వేసుకొన్నది? కళావతి చేసిన 10 వేల డాలర్ల బాకీని వసూలు చేసుకోవడానికి మహేష్ ఎందుకు వైజాగ్ వచ్చాడు? వైజాగ్‌లో ఎంపీ రాజేంద్రనాథ్‌తో మహేష్ వైరుధ్యం పెంచుకొంటాడు? తన దారికి అడ్డువస్తున్న మహేష్‌ను రాజేంద్రనాథ్ ఎలా అడ్డు తొలగించుకోవాలనుకొంటాడు. బ్యాంక్ రుణాల ఎగవేత కేసులో మేనేజర్ (నదియా)ను ఎందుకు అరెస్ట్ చేస్తారు? బ్యాంక్ మేనేజర్‌‌కు మహేష్ ఎందుకు అండగా నిలిచాడు? బ్యాంక్ రుణాన్ని ఎగవేసిన ఎంపీ రాజేంద్రనాథ్‌కు మహేష్ ఎలాంటి గుణపాఠం చెప్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే సర్కారు వారీ పాట సినిమా కథ.



మేకింగ్

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. 



విడుదల 

ఈ సినిమా  2 గంటల 42నిమిషాల నిడివితో మే 12న థియేటర్లలో విడుదల కాబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+