సావిత్రి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నారా రోహిత్, నందిత, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, అజయ్, రవి బాబు, జీవా, వెన్నెల కిషోర్, శ్రీముఖి, ధన్య బాలకృష్ణన్, మధు నందన్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను షకలక శంకర్, సత్య అక్కల, రవి బాబు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పవన్ సాదినేని నిర్వహించారు మరియు నిర్మాత బి రాజేంద్ర ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శ్రవణ్ స్వరాలు సమకుర్చరు.
కథ
పెళ్లిలోనే పుట్టిన సావిత్రి(నందిత)కు పెళ్లి ఓ అబ్సెషన్. చిన్నప్పటినుంచీ పెళ్లి,పెళ్లి అని కలవరిస్తూ ఇరవై ఏళ్లకు చేరుకుంటుంది. ఆమె పెళ్లి కోసం ఎంతకైనా తెగించే ఆమె తన అక్క గాయిత్రి(ధన్యా బాలకృష్ణన్) కి పెళ్లైతే తనకు లైన్ క్లియర్ అవుతుందని, ఇష్టం లేని పెళ్లికు బలేస్తుంది.ఇంత చేసినా ఆమె పెళ్లి కాదు.. అప్పటికి కూడా ఆమె జీవితంలో రాజకుమారుడు ఎంట్రీ ఇవ్వడు. తను ఎంత గాఢంగా పెళ్లి అనుకున్నా దూరం అవుతోందే అనుకుంటున్న సమయంలో ఆమెకు రిషి(నారా రోహిత్) పరిచయమవుతాడు. అతను షిర్డీ వెళ్లై ట్రైన్ లో కో పాసింజర్. అక్కడ నుంచి వీరిద్దరి మధ్యా రొటీన్ రొమాన్స్...పన్. అయితే ఈ లోగా అనుకోని ట్విస్ట్. అసలు సావిత్రి కు పెళ్లవుతుందా...రిషి..ఎలా తను ఇష్టపడ్డ ఆమెను దక్కించుకున్నాడు వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.