శంకర సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నారా రొహిత్, రెజీన కసాండ్ర, రాజివ్ కనకాల
తదితరులు ఇతర ముఖ్య పాత్రాలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం తాటినేని సత్య నిర్వహించారు మరుయు నిర్మాతలు ఆర్ వి చంద్ర మౌలి, ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చరు.
కథ
సమాజానికి తగినట్లు తనను మలచుకోలేక ఇబ్బంది పడే కాలేజీ స్టూడెంట్‌గా నారా రోహిత్ నటించాడు. తన కోపాన్ని అణుచుకోలేక చాలా సందర్భాల్లో చిక్కులు కొనితెచ్చుకతుంటాడు. అతని ప్రవర్తన అతని తల్లికి గానీ సోదరునికి గానీ నచ్చదు. కొన్ని పరిస్థితుల్లో తన సిటీ నుంచి బయటపడతాడు రోహిత్. బెంగుళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న కొందరు పోలీసులు ఓ యాక్సిడెంటును చూస్తారు. ఆ ప్రమాదంలో గాయపడిన బెంగుళూరు వ్యాపారి కొడుకును దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా వారికి పెద్ద మొత్తంలో సొమ్ము కనిపిస్తుంది. వాళ్ళు ఆ వ్యాపారి కొడుకును చంపేసి ఆ డబ్బుతో ఉడాయిస్తారు. అయితే అనుకోకుండా రోహిత్ ఈ కేసులో చిక్కుకుంటాడు. ఈ కేసు నుంచి బయటపడి తనను నిర్దోషిగా ఎలా నిరూపించుకుంటాడనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నారా రోహిత్ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు రెజీనా ఎలా సహాయపడుతుంది. అసలు వీరిద్దరి మధ్యా ప్రేమ కథ ఎలా సాగిందీ అన్న ప్రశ్నలకి సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే...