X
శంకర

శంకర

Action | Romance | 21 Oct 2016 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

శంకర స్టోరీ

శంకర సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నారా రొహిత్,  రెజీన కసాండ్ర, రాజివ్ కనకాల   తదితరులు ఇతర ముఖ్య పాత్రాలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం తాటినేని సత్య నిర్వహించారు మరుయు నిర్మాతలు ఆర్ వి చంద్ర మౌలి, ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చరు. కథ సమాజానికి తగినట్లు తనను మలచుకోలేక ఇబ్బంది పడే కాలేజీ స్టూడెంట్‌గా నారా రోహిత్ నటించాడు. తన కోపాన్ని అణుచుకోలేక చాలా సందర్భాల్లో చిక్కులు కొనితెచ్చుకతుంటాడు. అతని ప్రవర్తన అతని తల్లికి గానీ సోదరునికి గానీ నచ్చదు. కొన్ని పరిస్థితుల్లో తన సిటీ నుంచి బయటపడతాడు రోహిత్. బెంగుళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న కొందరు పోలీసులు ఓ యాక్సిడెంటును చూస్తారు. ఆ ప్రమాదంలో గాయపడిన బెంగుళూరు వ్యాపారి కొడుకును దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా వారికి పెద్ద మొత్తంలో సొమ్ము కనిపిస్తుంది. వాళ్ళు ఆ వ్యాపారి కొడుకును చంపేసి ఆ డబ్బుతో ఉడాయిస్తారు. అయితే అనుకోకుండా రోహిత్ ఈ కేసులో చిక్కుకుంటాడు. ఈ కేసు నుంచి బయటపడి తనను నిర్దోషిగా ఎలా నిరూపించుకుంటాడనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నారా రోహిత్ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు రెజీనా ఎలా సహాయపడుతుంది. అసలు వీరిద్దరి మధ్యా ప్రేమ కథ ఎలా సాగిందీ అన్న ప్రశ్నలకి సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే...
Read More

శంకర కాస్ట్ & క్రూ

శంకర సిబ్బంది సమాచారం

దర్శకత్వం తాటినేని సత్య
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సాయి కార్తీక్
నిర్మాత ఆర్ వి చంద్ర మౌలి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

శంకర విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ నారా రోహిత్ మాత్రమే. మొదటినుంచీ రోహిత్ ఎంచుకునే సబ్జెక్ట్లన్నీ కనీస సామాజిక కోనం నుంచే ఉంటాయి. తాను తనకోసమే కాక పూర్థిస్థాయి నటుడిగా కనిపించటానికే ప్రయత్నించే తత్వం వల్ల రోహిత్ మొత్తం సినిమాని తన భుజాలపై మోసే ప్రయత్నమే చేసాడు. కానీ మౌన గురు స్థాయిని అందుకోవటం లో మాత్రం దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పాలి. ఒరిజినల్ లో ఉన్న ఎమోషన్ ని సరిగ్గా క్యారీ చేయలేకపోయాడు. ఇక రెజీనా క్యారెక్టర్ సంగతికి వస్తే హీరోయింగా ఆమెకి కొంతలో కొంత గుర్తింపు ఉన్నా ఎందుకనో ఆ స్కోప్ ని ఉపయోగించుకోలేకపోయింది.రాజీవ్ కనకాల లాంటి మంచి ఆర్టిస్ట్ని కూడా సరిగా వాడుకోలేకపోయారు ఆవేశపరుడైన ఓ సాధారణ యువకుడు వ్యవస్థ మీద తిరగబడటం.. ఆ క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం.. చివరికి తన కష్టాలన్నింటినీ అధిగమించి తనను ఇబ్బంది పెట్టిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవడం నేపథ్యంలో కథ సాగుతుంది. నిజానికి ఒక సంచలనం గా మారాల్సిన కథ యావరేజ్ గా మాత్రమే నిలబడే సినిమాగా "శంకర" తయారయ్యింది. కేవలం నారా రోహిత్ యాక్తింగ్ మాత్రమే చూడాలంటే కథ ఎంత గొప్పదైనా సరైన పద్దతిలో నడవక పోతే ఆ సినిమా పరిస్థితేమిటో శంకరని చూస్తే చెప్పొచ్చు.

శంకర సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

శంకర

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+