శంకరాభరణం సినిమా కామిడి రొమాంట్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నిఖిల్ సిద్దార్థ్, నందిని, అంజలి, సుమన్, సితార, రావు రమేష్, సప్తగిరి, సత్యం రాజేష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఉదయ్ నందనవనం నిర్వహించారు మరియు నిర్మాత ఎమ్ వి వి సత్యనారాయణ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ప్రవీన్ లక్కరాజు స్వరాలు సమకుర్చరు.
కథ
యుఎస్ లో ఉంటూ నచ్చినట్లు ఎంజాయ్ చేస్తూ బ్రతుకుతున్న మిలియనీర్ గౌతమ్(నిఖిల్). ఓ రోజు అతని తండ్రి(సుమన్) ఊహించని విధంగా పార్టనర్స్ మోసంతో బిజినెస్ లో నిండా ములిగిపోతాడు. 12 కోట్లు అర్జెంటుగా కట్టాల్సిన పరిస్దితి వస్తుంది. డబ్బులేక... ఏం చేయలో అర్దం కాక, ఆత్మహత్య చేసుకోబోతే...సమస్య తెలుసుకున్న కొడుకు గౌతమ్...బీహార్ లో ఉన్న తన తల్లి ఆస్ది శంకరాభరణం అనే బిల్డింగ్ అమ్మి , అప్పులు నుంచి బయిటపడేద్దామని ఇండియా బయిలుదేరతాడు. నిత్యం కిడ్నాప్ లతో, అందుకు సంభందించిన గ్యాంగ్ లతో కిటకిటలాడుతున్న బీహార్ లోకి ఓ ఎన్నారై అడుగుపెట్టాడని తెలియగానే వారిలో కదలిక వస్తుంది. గౌతమ్ కిడ్నాప్ చేసి కోట్లు సంపాదించాలని ఎత్తు వేసి,అమలు చేస్తారు. తన ఆస్ది అమ్ముకుని పోదామనకున్న గౌతమ్ ఉన్నట్లుండి కిడ్నాప్ కావటంతో ... ఆ కిడ్నాప్ నుంచి డబ్బు సంపాదించాలనే ఎత్తు వేస్తాడు. అక్కడ నుంచి గౌతమ్ ఏం చేసాడు...శంకరాభరణం బిల్డింగ్ ని అమ్మాడా... తన తండ్రిని సమస్యల నుంచి బయిటపడేసాడా...కిడ్నాపైన అతని పరిస్ధితి ఏమైంది, సినిమాలో అంజలి పాత్ర ఏమిటి అనేది మిగతా కథ.