శేఖర్ (2022)(U/A)
Release date
20 May 2022
genre
శేఖర్ స్టోరి
శేఖర్ మూవీ యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో డా రాజా శేఖర్, ఆత్మీయ రాజన్, ముస్కాన్ ఖూబ్ చందాని, అభినవ్, కిషోర్, సమీర్, రవి వర్మ, శివాని రాజశేఖర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం లలిత్ వహించారు. ఎమ్ ఎల్ వి సత్యనారాయణ నిర్మించారు. సంగీతం అనూప్ రూబెన్స్ అందించారు.
కథ
పోలీస్ డిపార్ట్మెంట్లో శేఖర్ (రాజశేఖర్) నిబద్దత, నిజాయితీ గల అఫీసర్. తన మరదలు కిన్నెర (ముస్కాన్) ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తాడు కానీ ఓ కారణంగా పెళ్లి చేసుకోలేకపోతాడు. భార్య ఇందు (ఆత్మీయ రాజన్), కూతురు గీత (శివానీ రాజశేఖర్)తో జీవితం సాఫీగా సాగుతున్న క్రమంలో కిన్నెర దారుణ హత్యకు గురవుతుంది. దాంతో మద్యానికి బానిస అవుతాడు. ఆ కారణంగా భార్య ఆత్మీయకు దూరమవుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో భార్య, కూతురు అనుమానాస్పద స్థితిలో మరణిస్తారు. జీవితంలో చోటు చేసుకొన్న విషాదాలతో ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. ఉద్యోగానికి రాజీనామా చేసిన శేఖర్ పోలీసు డిపార్ట్మెంట్తో ఎందుకు కలిసి పనిచేస్తాడు? కిన్నెర హత్యకు కారణం ఎవరు? సొంత కూతురు, భార్య ఎలా చనిపోయింది? తన కుటుంబ మరణాల వెనుక కారణం ఏమిటి? తన భార్య, కూతురు మరణాలపై తలెత్తిన అనుమానాలపై శేఖర్ ఎలాంటి దర్యాప్తు చేశాడు? ప్రభుత్వాలు అమలు చేస్తున్న జీవన్ ధాన్ స్కీమ్‌లోని అవకతవకలకు ఎలా పరిష్కారం చూపాడు అనే భావోద్వేగమైన ప్రశ్నలకు సమాధానమే శేఖర్ మూవీ సినిమా కథ.
**Note:Hey! Would you like to share the story of the movie శేఖర్ with us? Please send it to us ([email protected]).