X
శేఖర్

శేఖర్

Action | Thriller | 20 May 2022 | U/A | 131 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

శేఖర్ స్టోరీ

శేఖర్ మూవీ యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో డా రాజా శేఖర్, ఆత్మీయ రాజన్, ముస్కాన్ ఖూబ్ చందాని, అభినవ్, కిషోర్, సమీర్, రవి వర్మ, శివాని రాజశేఖర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం లలిత్ వహించారు. ఎమ్ ఎల్ వి సత్యనారాయణ నిర్మించారు. సంగీతం అనూప్ రూబెన్స్ అందించారు. కథ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో శేఖర్ (రాజశేఖర్) నిబద్దత, నిజాయితీ గల అఫీసర్. తన మరదలు కిన్నెర (ముస్కాన్) ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తాడు కానీ ఓ కారణంగా పెళ్లి చేసుకోలేకపోతాడు. భార్య ఇందు (ఆత్మీయ రాజన్), కూతురు గీత (శివానీ రాజశేఖర్)తో జీవితం సాఫీగా సాగుతున్న క్రమంలో కిన్నెర దారుణ హత్యకు గురవుతుంది. దాంతో మద్యానికి బానిస అవుతాడు. ఆ కారణంగా భార్య ఆత్మీయకు దూరమవుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో భార్య, కూతురు అనుమానాస్పద స్థితిలో మరణిస్తారు. జీవితంలో చోటు చేసుకొన్న విషాదాలతో ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. ఉద్యోగానికి రాజీనామా చేసిన శేఖర్‌ పోలీసు డిపార్ట్‌మెంట్‌తో ఎందుకు కలిసి పనిచేస్తాడు? కిన్నెర హత్యకు కారణం ఎవరు? సొంత కూతురు, భార్య ఎలా చనిపోయింది? తన కుటుంబ మరణాల వెనుక కారణం ఏమిటి? తన భార్య, కూతురు మరణాలపై తలెత్తిన అనుమానాలపై శేఖర్ ఎలాంటి దర్యాప్తు చేశాడు? ప్రభుత్వాలు అమలు చేస్తున్న జీవన్ ధాన్ స్కీమ్‌లోని అవకతవకలకు ఎలా పరిష్కారం చూపాడు అనే భావోద్వేగమైన ప్రశ్నలకు సమాధానమే శేఖర్ మూవీ సినిమా కథ.
Read More

శేఖర్ కాస్ట్ & క్రూ

శేఖర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం లలిత్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనూప్ రుబెన్స్
నిర్మాత ఎం.ఎల్.వి సత్యనారాయణ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

శేఖర్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
మెడికల్ మాఫియా, అవయవాల దానంలో లోపాలపై ధ్వజమెత్తిన చిత్రం శేఖర్. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీవన్ ధాన్ స్కీమ్ వల్ల ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయి. అమాయకులు ఎలా బలి అవుతున్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అవయవాల దానాన్ని వాడుకొని ఎలాంటి కుంభకోణాలకు పాల్పడుతుందనే వివాదాలకు చక్కటి పరిష్కారం, ప్రజలకు అవగాహన కల్పించే విధంగా సినిమాను రూపొందించారు. ఎమోషనల్, ఫ్యామిలీ అంశాలు, రాజశేఖర్ విభిన్నమైన నటనత ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఈ సినిమాను థియేటర్‌లో చూడటం వల్ల గొప్ప భావోద్వేగం కలుగుతుంది. ఈ వీకెండ్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చూడాలనుకొనే వారికి శేఖర్ కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు.

శేఖర్ ట్రైలర్

Video Thumbnail

శేఖర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

శేఖర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+