శౌర్యం సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో గోపీచంద్, అనుష్క, పూనమ్ కౌర్, మనోజ్.కె, జయన్, ధర్మవరపు, తనికెళ్ల భరణి, రఘుబాబు, అలీ, కృష్ణభగవాన్, ఎమ్మెస్ నారాయణ, సుధ, శరత్ బాబు తదితరులు పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శివ నిర్వహించారు మరియు నిర్మాత వి ఆనందప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి శర్మ స్వరాలు సమకుర్చారు.
కథ
పోలీస్ ఆఫీసర్ విజయ్(గోపీచంద్)కి చెల్లి దివ్య(పూనమ్ కౌర్) అంటే ప్రాణం. కానీ చిన్నతనంలో ఏర్పడ్డ ఓ చిన్న అపార్ధంతో ఆమె జీవితకాలంగా అతన్ని ద్వేషిస్తూ దూరంగా వెళ్ళిపోతుంది. మరో ప్రక్క విజయ్ వృత్తి పరంగా శివరామ్ గౌడ్(మనోజ్ కె జయన్) అనే లోకల్ డాన్ తో తలపడతాడు. దాంతో విలన్ విజయ్ పై కక్ష కట్టి, అతని ప్రాణమైన చెల్లిని చంపటం ద్వారా పగతీర్చుకోవాలని ఆమె కోసం వెతుకుతూంటాడు. అలా విలన్స్, విజయ్ విడివిడిగా దివ్య కోసం వెతుకుతూంటారు. చివరకి ఎవరికి ఆమె దొరికింది....విజయ్ ని ఆమె తన అన్న గా ఏక్సెప్ట్ చేసిందా అలాగే ఈ కథలోకి శ్వేత (అనూష్క) ఎలా వచ్చింది అనేది అన్న విషయాలు తెరపై వచ్చే యాక్షన్ ఎపిసోడ్ల తో కలిపి చూసి తెలుసుకోవాల్సిందే.