స్కై ల్యాబ్ (2021)(U)
Release date
04 Dec 2021
genre
స్కై ల్యాబ్ స్టోరి
స్కై ల్యాబ్ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ఇందులో సత్య దేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ, తులసి, తనికెళ్ళ భరణి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విష్వక్ ఖండేరావు వహించారు. నిర్మాత ప్రిథ్వి పిన్నమరాజు నిర్మించారు. సంగీతం ప్రశాంత్ ఆర్ విహారి అందించారు.
కథ
జర్నలిస్టుగా రాణించాలనే తపనతో గౌరి ( నిత్యమీనన్) కథలు రాస్తుంటారు. కానీ తను రాసిన కథలు ప్రచురణకు నోచుకోలేకపోతుంటాయి. డాక్టర్ చదువులు చదివిన ఆనంద్ (సత్యదేవ్) వృత్తిని కొనసాగించడానికి లైసెన్స్ కోసం 5 వేలు డబ్బుల కట్టలేక బాధపడుతుంటాడు. గొప్ప కుటుంబ నేపథ్యం ఉన్న సుబేదార్ రామారావు (రాహుల్ రామకృష్ణ) అప్పుల్లో కూరుకుపోయి జీవితాన్ని సమస్యల బండి మీద లాగిస్తుంటాడు. అనేక మూడ నమ్మకాలు ఉన్న గ్రామంలో తాము సొంత కాళ్లపై నిలబడాలనే లక్ష్యంతో డాక్టర్, ఆనంద్ హాస్పిటల్‌ను తెరుస్తారు. ఆ క్రమంలోనే స్కైలాబ్ పడుతుందనే వార్తలను ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తాయి. గొప్ప జర్నలిస్టుగా రాణించాలని ప్రయత్నిస్తున్న గౌరీ లక్ష్యం నెరవేరిందా? స్కైలాబ్ ఘటన ఆమె కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పింది? గ్రామంలో మూడ నమ్మకాల మధ్య ఆనంద్ డాక్టర్‌గా సెటిల్ అయ్యాడా? అప్పులా బారిన పడిన సుబేదార్ రామారావు జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకొన్నాయి? స్కైలాబ్ ఘటన గ్రామ ప్రజల ఆలోచనల్లోను, జీవనశైలిలో ఎలాంటి మార్పులు తెచ్చిందనే ప్రశ్నలకు సమాధానమే స్కైలాబ్ సినిమా కథ.
**Note:Hey! Would you like to share the story of the movie స్కై ల్యాబ్ with us? Please send it to us ([email protected]).