స్పీడున్నోడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సోనారిక భడొరియా, తమన్న, రావు రమేష్, శ్రీనివాస రెడ్డి, ఫిస్ వెంకట్, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, పృద్వి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బీమినేని శ్రీనివాస రావు నిర్వహించారు మరియు నిర్మాత బీమనేని సునీత నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శ్రీ వసంత్ స్వరాలు సమకుర్చరు.
కథ
చదువు పూర్తై ఆవారాగ తిరుగుతున్న శోభన్ (బెల్లంకొండ శ్రీనివాస్) కు ఉన్న బలహీనత ఫ్రెండ్ షిప్. అందుకోసం ఏదైనా చేయటానికి, ఎంతదూరం అయినా వెళ్లటానికి రెడీ అవుతూంటాడు. అలాంటి శోభన్ ..తన ఫ్రెండ్ గిరి (మధు) ప్రేమను గెలిపించటానికి రంగంలోకి దిగుతాడు. ఎవరా ఆ అమ్మాయి అని చూస్తే తన ఫ్లాష్ బ్యాక్ లో తన ప్రేమను నిరాకరించిన వాసంతి(సోనారిక) అని అర్దమవుతుంది. అయినా సరే...ఆమెను తన ఫ్రెండ్ కు సెట్ చేయాలని ఆ ప్రయత్నంలో ఉండగా...ఇప్పుడు నీ ప్రేమను ఓకే చేసాను అంటుంది ఆమె. మరో ప్రక్క ఆమెకు జగన్ (కబీర్ సింగ్ దుహాన్) తో మ్యారేజ్ సెటిల్ అవుతుంది. అప్పుడు శోభన్ ఏం చేసాడు.. తన ఫ్రెండ్ కోసం తన ప్రేమను త్యాగం చేసాడా లేక ప్రేమ కోసం ఫ్రెండ్ నే వదిలించుకుంటాడా.. ఎలా మ్యానేజ్ చేసాడు..ఆ క్రమంలో ఏం జరిగింది అనేది మిగతా కథ.