X
స్టాండ‌ప్ రాహుల్‌
Comedy | Romance | 18 Mar 2022 | U/A | 130 Mins
Telugu

స్టాండ‌ప్ రాహుల్‌ స్టోరీ

స్టాండ‌ప్ రాహుల్‌ సినిమా కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజ్ తరుణ్, వర్షా బొల్లమ్మ, వెన్నెల‌కిషోర్‌, ముర‌ళి శ‌ర్మ‌, ఇంద్ర‌జ‌, దేవీ ప్ర‌సాద్ మ‌రియు మ‌ధురిమ ఇతర ముఖ్య పాత్ర‌ల్లో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సాంటో మోహన్ వీరంకి వహించారు. నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి నిర్మాతలు కలిసి నిర్మించారు. సంగీతం స్వీకర్ అగస్తి అందించారు. 

కథ

రాహుల్ (రాజ్ తరుణ్) గాలికి తిరిగే నేటి మధ్య తరగతి కుర్రాడు. స్టాండప్ కమెడియన్ కావాలనేది రాహుల్ కల. అయితే చిన్ననాడే తల్లిదండ్రులు విడిపోవడం, ఉద్యోగం చేయమని తల్లి బలవంతం చేయడంతో ఒక వీఆర్ (వర్చువల్ రియాలిటీ) కంపెనీలో చేరతాడు. అయితే తండ్రి మాత్రం నచ్చింది చేయమని చెప్తూ ఉంటారు. ఈ క్రమంలో స్టాండప్ కామెడీ అతనికి ఒక బూస్ట్ లా పని చేస్తూ ఉంటుంది. అక్కడ స్కూల్ మేట్ శ్రేయ రావు (వర్ష బొల్లమ్మ) తిరిగి పరిచయం అవుతుంది. ఇద్దరు ప్రేమలో పడ్డా రాహుల్ కి పెళ్లి మీద నమ్మకం లేకపోవడంతో లివిన్(సహ జీవనం)లో ఉండడం మొదలు పెడతారు. ఆ తర్వాత ఏమైంది? రాహుల్ స్టాండప్ కమెడియన్ అయ్యాడా? లేదా? తల్లికి ఇష్టం లేని స్టాండప్ కామెడీ అతడు వదిలేశాడా? లేక ప్యాషన్ ను నమ్మి ముందుకు వెళ్లాడా? రాహుల్ శ్రేయ లివ్ - ఇన్ రిలేషన్షిప్ గురించి ఇద్దరి ఇళ్ళల్లో తెలిసిందా? లేదా? శ్రేయ రావు పెళ్లి చేసుకుందామని అడిగితే రాహుల్ ఎందుకు నో చెప్పాడు? చివరికి, వారిద్దరూ పెళ్లి చేసుకున్నారా? లేదా ఏమైంది? అనేది మిగతా కథ. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+