సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా డ్రామా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సూర్య, సమీరారెడ్డి, దివ్య, సిమ్రన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గౌతమ్ వాసుదేవమీనన్ నిర్వహించారు మరియు నిర్మాత వి రవిచంద్రన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు హర్రిశ్ జయరాజ్ స్వరాలు సమకుర్చారు.
కథ
సూర్య (సూర్య)కి తన తండ్రి(మళ్ళి సూర్యానే) అంటే విపరీతమైన ఆరాధన. ఆయన్ని ఓ హీరోలా, ఐకన్ లా చూస్తూంటాడు. అలాగే అతని తల్లి(మాలిని) కూడా నెమ్మదస్తురాలు,కుటుంబానికి మూలస్ధంబంలా ఉంటుంది. అతనికో చెల్లెలు. ఇలా ఫ్రెండ్స్ లా ఉండే ఫ్యామిలి మెంబర్స్ నీడలో ఏదీ అసాధ్యం కాదు అనే కాన్సెప్ట్ జీర్ణించుకుని సూర్య పెరిగి పెద్దవుతాడు. టీనేజ్ లోకి రాగానే తొలిచూపులోనే మేఘన(సమీరా రెడ్డి)తో ప్రేమలో పడతాడు. అయితే ఆమె అతనికి అనుకోకుండా మిస్సయిపోతుంది. అది తట్టుకోలేని సూర్య డ్రగ్స్ కి ఎడిక్ట్ అవుతాడు. అప్పుడు ఆ తల్లి తండ్రులు ఆ బిడ్డను ఎలా రక్షించుకున్నారు. తిరిగి అతను జీవితంలో పడి ఏం సాధించి సంపూర్ణతను సాధించుకున్నాడనేది మిగతా కథ.