X
తెలుగు » సినిమాలు » సూర్య సన్నాఫ్ కృష్ణన్
సూర్య సన్నాఫ్ కృష్ణన్

సూర్య సన్నాఫ్ కృష్ణన్

Drama | 14 Nov 2008 | U |
Telugu

2.8 /5 Users

2.5 /5 Filmibeat

సూర్య సన్నాఫ్ కృష్ణన్ స్టోరీ

సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా డ్రామా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సూర్య, సమీరారెడ్డి, దివ్య, సిమ్రన్‌ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గౌతమ్ వాసుదేవమీనన్ నిర్వహించారు మరియు నిర్మాత వి రవిచంద్రన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు హర్రిశ్ జయరాజ్ స్వరాలు సమకుర్చారు. కథ సూర్య (సూర్య)కి తన తండ్రి(మళ్ళి సూర్యానే) అంటే విపరీతమైన ఆరాధన. ఆయన్ని ఓ హీరోలా, ఐకన్ లా చూస్తూంటాడు. అలాగే అతని తల్లి(మాలిని) కూడా నెమ్మదస్తురాలు,కుటుంబానికి మూలస్ధంబంలా ఉంటుంది. అతనికో చెల్లెలు. ఇలా ఫ్రెండ్స్ లా ఉండే ఫ్యామిలి మెంబర్స్ నీడలో ఏదీ అసాధ్యం కాదు అనే కాన్సెప్ట్ జీర్ణించుకుని సూర్య పెరిగి పెద్దవుతాడు. టీనేజ్ లోకి రాగానే తొలిచూపులోనే మేఘన(సమీరా రెడ్డి)తో ప్రేమలో పడతాడు. అయితే ఆమె అతనికి అనుకోకుండా మిస్సయిపోతుంది. అది తట్టుకోలేని సూర్య డ్రగ్స్ కి ఎడిక్ట్ అవుతాడు. అప్పుడు ఆ తల్లి తండ్రులు ఆ బిడ్డను ఎలా రక్షించుకున్నారు. తిరిగి అతను జీవితంలో పడి ఏం సాధించి సంపూర్ణతను సాధించుకున్నాడనేది మిగతా కథ.
Read More

సూర్య సన్నాఫ్ కృష్ణన్ కాస్ట్ & క్రూ

సూర్య సన్నాఫ్ కృష్ణన్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం గౌతమ్ మీనన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం హారీష్ జయరాజ్
నిర్మాత రవి చంద్రన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సూర్య సన్నాఫ్ కృష్ణన్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఒక జీవితాన్ని మొత్తాన్ని ఓ మూడు గంటలు సినిమాలో చూపెట్టడం కష్టమే. పోనీ ఎలాగోలా తిప్పలు పడి చూపించినా ఊహించని మలుపులు,ఎంటర్ టైన్ మెంట్ లేని ఆ సాదా సీదా జీవిత సారాన్ని భరించటం మరీ కష్టం. అదే సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా తేల్చి చెప్పిన సత్యం. అయితే గజనీ ఫేమ్ సూర్య డబుల్ రోల్ లో నటించటం,కాక కాక (ఘర్షణ) వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందిచిన గౌతమ్ మీనన్ డైరక్టర్ కావటం,దశావతారం వంటి భారీ చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన సినిమా కావంటం ఈ ఫిల్మ్ కు ఎక్కడలేని క్రేజ్ తీసుకొచ్చాయి. కానీ విపరీతమైన భావోద్వేగాలు స్లో నేరేషన్ తో నడిచే కథనం ఉన్న ఈ సినిమా చూడాలంటే టిక్కెట్టు రేటుతో పాటు గొప్ప ఓపిక కూడా ఉండాల్సిందే

సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.8 /5 Your Rating

సూర్య సన్నాఫ్ కృష్ణన్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+