తిక్క సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి ధరమ్ తేజ్, లారిస్సా బొనేసి, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, వెన్నేల కిశోర్, రఘు బాబు, తాగుబోతు రమేష్, పృద్వి రాజ్, సప్తగిరి తదితరులు ఇతర ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సునిల్ రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాతలు బి ఆర్ దుగ్గినేని, రోహిన్ రెడ్డి కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు తమన్ ఎస్ స్వరాలు సమకుర్చురు.
కథ
ఆదిత్య (సాయిధరమ్ తేజ్) మందు,మగువ లైఫ్ అని ఓ జల్సారాయుడు. అలాంటి ఈ కుర్రాడు ఓ రోజు అంజలి (లరిస్సా బోన్సి) తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని సైట్ కొట్టి,కొట్టి,ఆమెను ఒప్పిస్తాడు. అంతేకాకుండా ఆమె కోసం తనను తాను మార్చుకుంటాడు. కానీ ఓ రోజు ఆమె హఠాత్తుగా కొన్నిసిల్లీ రీజన్స్ సాకుగా చూపించి బ్రేకప్ చెప్పి బై అంటుంది అంజలి. వెళ్తూ.. వెళ్తూ ఓ ఉత్తరం ఆదిత్య జేబులో పెట్టి వెళుతుంది. అంజలి దూరమైందన్న బాధతో ఫ్రెండ్స్ తో కలసి తెగ తాగేస్తాడు ఆదిత్య. ఆ హ్యాగోవర్ లో చేసిన కొన్ని చిన్న చిన్న తప్పులు వల్ల మొత్తం మారిపోతుంది. రకరకాల కన్ఫూజన్స్ ఏర్పడతాయి.ఆ కన్ఫూజన్స్ ఏమిటి? అంజలి బ్రేకప్ కి అసలు రీజన్ ఏమిటి? అసలా లెటర్ లో ఏముంది? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.