X
తిక్క

తిక్క

Action | Romance | 13 Aug 2016 |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

తిక్క స్టోరీ

తిక్క సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి ధరమ్ తేజ్, లారిస్సా బొనేసి, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, వెన్నేల కిశోర్ , రఘు బాబు, తాగుబోతు రమేష్, పృద్వి రాజ్, సప్తగిరి తదితరులు ఇతర ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సునిల్ రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాతలు బి ఆర్ దుగ్గినేని, రోహిన్ రెడ్డి కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు తమన్ ఎస్ స్వరాలు సమకుర్చురు.      కథ ఆదిత్య (సాయిధరమ్‌ తేజ్‌) మందు,మగువ లైఫ్ అని ఓ జల్సారాయుడు. అలాంటి ఈ కుర్రాడు ఓ రోజు అంజలి (లరిస్సా బోన్సి) తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని సైట్ కొట్టి,కొట్టి,ఆమెను ఒప్పిస్తాడు. అంతేకాకుండా ఆమె కోసం తనను తాను మార్చుకుంటాడు. కానీ ఓ రోజు ఆమె హఠాత్తుగా కొన్నిసిల్లీ రీజన్స్ సాకుగా చూపించి బ్రేకప్‌ చెప్పి బై అంటుంది అంజలి. వెళ్తూ.. వెళ్తూ ఓ ఉత్తరం ఆదిత్య జేబులో పెట్టి వెళుతుంది. అంజలి దూరమైందన్న బాధతో ఫ్రెండ్స్ తో కలసి తెగ తాగేస్తాడు ఆదిత్య. ఆ హ్యాగోవర్ లో చేసిన కొన్ని చిన్న చిన్న తప్పులు వల్ల మొత్తం మారిపోతుంది. రకరకాల కన్ఫూజన్స్ ఏర్పడతాయి.ఆ కన్ఫూజన్స్ ఏమిటి? అంజలి బ్రేకప్ కి అసలు రీజన్ ఏమిటి? అసలా లెటర్ లో ఏముంది? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 
Read More

తిక్క కాస్ట్ & క్రూ

తిక్క సిబ్బంది సమాచారం

దర్శకత్వం సునిల్ రెడ్డి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత బి ఆర్ దుగ్గినేని, రోహిన్ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

తిక్క విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
హాలీవుడ్ చిత్రం హ్యాంగోవర్ ని గుర్తు చేసే ఈ కథని కన్ఫూజన్ కామెడీ గా చేసి నవ్విద్దామని దర్శకుడు అభిప్రాయం. అయితే కథలో పాత్రలను కన్ఫూజన్ చేసే క్రమంలో కథకుడే డైరక్టర్ అయిన సునీల్ రెడ్డి కన్ఫూజ్ అయిపోయినట్లున్నాడు. అక్కడక్కడా నవ్వించినా చాలా వరకూ నవ్వులు పాలైంది. ఈ మధ్యకాలంలో ఇంత తిక్క తిక్కగా రాసిన కథ కానీ, సినిమా కానీ ఏదీ లేదనే చెప్పాలి. సినిమా అవుట్ పుట్ చూసుకుని టైటిల్ పెట్టాడా అనే డౌట్ వచ్చేలా సినిమా నడుస్తుంది...సినిమాలో చాలామంది నటీనటులున్నారు. అయితే ఎవరినీ సరిగా ఉపయోగించుకోలేదు. సరికదా వాళ్లందిరి చేతా గోల గోల చేయించాడు. ఆఖరికి రాజేంద్రప్రసాద్‌, ఇద్దరు హీరోయిన్లతో సహా..అందరూ గోల చేయటమే సరిపోయింది...స్పెషాలిటీ ఏమిటీ అంటే ప్రతీ క్యారక్టర్ చేతిలోనూ ఓ మందుబాటిల్ ఉండటమే. తిక్క అని పెట్టకుండా మందు బాటిల్ అని పెట్టినా పోయిదేమో అనిపిస్తుంది. సాయి ధరమ్ తేజ చాలా ఉషారుగా నటించే ప్రయత్నం చేసాడు. సీన్స్ లో బలం లేనప్పుటికీ ఉన్నంతలో వాటిని కవర్ చేసే ప్రయత్నం చేసాడు కానీ బొక్కలెక్కవటంతో బోర్లా పడ్డాడు.

తిక్క సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

తిక్క

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+