తుఫాన్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ చరణ్, ప్రియాంక చోప్రా, శ్రీ హరి,తణికెళ్ల భరణి, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే , దర్శకుడు : అపూర్వ లఖియా నిర్వహించారు మరియు నిర్మాతలు : పునీత్ ప్రకాష్ మెహ్రా, సుమిత్ ప్రకాష్ మెహ్రా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకులు చిరంతన్ భట్ - ఆనంద్ రాజ్ ఆనంద్ - మీట్ బ్రోస్ అంజన్ స్వరాలు సమకుర్చరు.
కథ
నీతి నిజాయితీలే ప్రాణంగా బ్రతికే పోలీస్ ఆఫీసర్ ఎసిపి విజయ్ ఖన్నా (రామ్ చరణ్). అతని నిక్కచ్చితనం, స్ట్రైయిట్ ఫార్వర్డ్ నెస్ లతో నిరంతరం ట్రాన్సఫర్స్ ఎదుర్కొంటున్నా,తన పద్దతి మాత్రం మార్చుకోడు. ప్రస్తుతం కథా కాలానికి హైదరాబాద్ లో ఉన్న విజయ్ ... లోకల్ పొలిటీషియన్స్ కి అడ్డంగా అనిపించటంతో ముంబైకి ట్రాన్స్ ఫర్ చేయిస్తారు. అక్కడ అతనికోసం ముంబై డిప్యూటి కలెక్టర్ మర్డర్ కేసు ఎదురుచూస్తూంటుంది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేసే భాధ్యత భుజాన వేసుకున్న అతనికి ఆ మర్డర్ వెనక ఉన్న ఆయిల్ మాఫియా గురించి తెలుస్తుంది. అలాగే ఆ మర్డర్ కి ఏకైక సాక్షి... ఎన్నారై మాల(ప్రియాంక చోప్రా) అని తెలిసి..ఆమె సాయిం అడుగుతాడు. ఈ క్రమంలో ఆయిల్ మాఫియా సామ్రాజ్యాధినేత రుద్ర ప్రతాప్ తేజ(ప్రకాష్ రాజ్)ని ఎదుర్కొవాల్సి వస్తుంది. అతని ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎలా అతని ఆయిల్ మాఫియాని అంతమొందించాడు...పోలీస్ పవర్ ఏంటనేది ఎలా చూపించాడు...విజయ్ కి మాలకి మధ్య ఉన్న రిలేషన్ ఏ దిశకు టర్న్ తీసుకుంది. షేర్ ఖాన్(శ్రీ హరి) ఎవరు..అతనితో విజయ్ కి పనేంటి....కథలో అతని పాత్రేంటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.