తూనీగ తూనీగ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుమంత్ అశ్విన్, రియా చక్రవర్తి, పరుచూరి వెంకటేశ్వరరావు, ప్రభు, నాగబాబు, విజయ్‌చందర్, సాయాజీ షిండే తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: ఎం.ఎస్.రాజు నిర్వహించారు మరియు నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కార్తీక్ రాజా స్వరాలు సమకుర్చారు.
కథ
వంటవాడు(ప్రభు)కి తన యజమాని(నాగబాబు)తో మంచి స్నేహం. అయితే వారి పిల్లలు మాత్రం వీరికి భిన్నంగా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ కొట్టుకుంటూంటారు. కొట్టుకునే వాళ్లే తదుపరి కాలంలో ప్రేమలో పడతారనే సినీ థియరీప్రకారం పెద్దయ్యాక కార్తీక్ రామస్వామి (సుమంత్ అశ్విన్), నిధి (రియా) యధావిధిగా తన భాధ్యతగా ప్రేమలో పడతారు. అయితే వీరి ప్రేమని అడ్డుకోవటానికి హీరోయిన్ తండ్రి నాగబాబు ఆస్తిపై కన్నేసిన మరో కుటుంబం (వినోద్ కుమార్) కథ లోకి ప్రవేశిస్తుంది. తమ కొడుకుకి హీరోయిన్ తో పెళ్లి చేసి ఆస్తి ఆక్రమించటం కోసం...ఆ విలనీ కుటుంబం హీరో, హీరోయిన్ల ప్రేమలో, వాళ్ల తండ్రుల స్నేహంలో చిచ్చుపెడతారు. అలా విడిపోయిన ఆ ప్రేమికులు చివరకు ఎలా కలిసారు అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.