X
తెలుగు » సినిమాలు » తూనీగ తూనీగ
తూనీగ తూనీగ

తూనీగ తూనీగ

Romance | 20 Jul 2012 | U |
Telugu

2.7 /5 Users

2 /5 Filmibeat

తూనీగ తూనీగ స్టోరీ

తూనీగ తూనీగ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుమంత్‌ అశ్విన్‌, రియా చక్రవర్తి, పరుచూరి వెంకటేశ్వరరావు, ప్రభు, నాగబాబు, విజయ్‌చందర్‌, సాయాజీ షిండే తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: ఎం.ఎస్‌.రాజు నిర్వహించారు మరియు నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కార్తీక్ రాజా స్వరాలు సమకుర్చారు. కథ వంటవాడు(ప్రభు)కి తన యజమాని(నాగబాబు)తో మంచి స్నేహం. అయితే వారి పిల్లలు మాత్రం వీరికి భిన్నంగా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ కొట్టుకుంటూంటారు. కొట్టుకునే వాళ్లే తదుపరి కాలంలో ప్రేమలో పడతారనే సినీ థియరీప్రకారం పెద్దయ్యాక కార్తీక్‌ రామస్వామి (సుమంత్‌ అశ్విన్‌), నిధి (రియా) యధావిధిగా తన భాధ్యతగా ప్రేమలో పడతారు. అయితే వీరి ప్రేమని అడ్డుకోవటానికి హీరోయిన్ తండ్రి నాగబాబు ఆస్తిపై కన్నేసిన మరో కుటుంబం (వినోద్ కుమార్) కథ లోకి ప్రవేశిస్తుంది. తమ కొడుకుకి హీరోయిన్ తో పెళ్లి చేసి ఆస్తి ఆక్రమించటం కోసం...ఆ విలనీ కుటుంబం హీరో, హీరోయిన్ల ప్రేమలో, వాళ్ల తండ్రుల స్నేహంలో చిచ్చుపెడతారు. అలా విడిపోయిన ఆ ప్రేమికులు చివరకు ఎలా కలిసారు అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
Read More

తూనీగ తూనీగ కాస్ట్ & క్రూ

తూనీగ తూనీగ సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఎమ్ ఎస్ రాజు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కార్తీక్ రాజా
నిర్మాత దిల్ రాజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

తూనీగ తూనీగ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
పేదోడ్ని కొట్టగలరు కానీ ప్రేమికుడిని కొట్టలేరు వంటి డైలాగులతో వచ్చిన ఈ చిత్రం ఫస్టాఫ్ సరదాగా గడిచిపోయినా సెకండాఫ్ నత్త నడక నడుస్తుంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్స్ ప్రేమను విడకొట్టడానికి లేడీ విలన్స్ వేసే ఎత్తుకు పై ఎత్తులతో టీవి సీరియల్ వాతావరణం క్రియేట్ అయ్యింది. దానికి తోడు హీరో తన ప్రేమకి విలన్స్ అడ్డుపడుతున్నారనే విషయం పట్టించుకోకుండా... ఎలాగూ క్లైమాక్స్ లో విధి తమని కులుపుతుందన్నట్లు ఏమీ చెయ్యకుండా ప్యాసివ్ గా చూస్తూంటాడు. అదే ఈ సినిమాకు బేస్ గా తీసుకున్న ప్రేమ పావురాలు (సినిమాలో కూడా పావురం మొదటి నుంచి చివరి వరకూ ఉంటుంది)లో కూడా హీరో తన ప్రేమ కోసం ఇంట్లోకి బయటకు వచ్చి తన వంతు ప్రయత్నం చేస్తూంటాడు.

తూనీగ తూనీగ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • Story acting song cast very good simple & super

×
2.7 /5 Your Rating

తూనీగ తూనీగ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+