ఉలవచారు బిర్యాని సినిమా డ్రామా ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రకాష్‌రాజ్, స్నేహ, తేజస్, సంయుక్త , ఎం.ఎస్.నారాయణ, బ్రహ్మాజీ, ఊర్వశి, ఐశ్వర్య, కోటేష్ మన్నన, శివాజీరావు యాదవ్, విజయ్ తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి ప్రకాష్ రాజ్ నిర్వహించారు మరియు నిర్మాత కె ఎస్ రామారావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మేస్ట్రో ఇళయరాజా స్వరాలు సమకుర్చారు.
కథ
పురావస్తు శాఖలో పనిచేసే కాళిదాసు(ప్రకాష్ రాజ్) భోజన ప్రియుడు...క్రానిక్ బ్యాచులర్. మరో ప్రక్క గౌరీ(స్నేహ) ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్. జాతకంలో ఉన్న దోషంతో పెళ్లి కాక మిగిలిపోతుంది. వీళ్లిద్దరూ అనుకోనివిధంగా..విధి వశాత్తు ఫోన్ లో గొడవ పడతారు. అయితే తర్వాత తాము పొరపాటు పడ్డామని,రాంగ్ నెంబర్ అని తెలుసుకుని సారీ చెప్పుకుంటారు. అలా మొదలైన వీరి ఫోన్ స్నేహం... పెరిగి ఓ ఫైన్ డే కలవాలనే నిర్ణయానికి వస్తారు. అయితే తమ వయస్సులు గురించి ఆలోచించిన కాళిదాసు,గౌరీ ఒకరినొకరు కలవటానికి సంశయిస్తారు. ఆ సంసయంలో తమ అసలు ఐడెంటిటీ బయిటపెట్టకుండా... కాళి దాసు తన మేనల్లుడు నవీన్ (తేజస్)ని, గౌరీ తన సోదరి(సంయుక్త)ని పంపుతారు . అప్పుడేం జరిగింది. వీరిద్దరూ ఎలా కలిసి,ఒకటయ్యారు అనేది మిగతా కథ. అలాగే ఈ కథలో ఈ యువ జంట పాత్రేమిటి అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.