twitter

    ఉమామహేశ్వర ఉగ్రరూపస్య స్టోరి

    ఉమామహేశ్వర ఉగ్రరూపస్య  సినిమా కామిడి, డ్రామా, ఎంటర్టైనర్ చిత్రం ఇందులో  సత్య దేవ్, సుహాస్, నరేష్, ఆటో రామ్ ప్రసాద్, టి ఎన్ ఆర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వెంకటేష్ మహా వహించారు. నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి నిర్మించారు. సంగీతం బిజీబల్ మణియి  అందించారు.

    కథ

    అరకు గ్రామంలోని ఫోటోగ్రాఫర్‌ ఉమామహేశ్వర్ (సత్యదేవ్), ఎముకలు విరిగితే కట్లుకట్టే నాటు వైద్యు బాబ్జీ (నరేష్), గ్రామ పంచాయితీ మెంబర్ నాంచారయ్య (టీఎన్ఆర్) లాంటి వ్యక్తులు కలిసి మెలిసి జీవిస్తుంటారు. చిన్నప్పటి స్నేహితురాలు స్వాతి (హరి చందన కొప్పిశెట్టి)తో ప్రేమలో పడుతాడు. కొన్ని కారణాల వల్ల స్వాతి మరొకరిని పెళ్లి చేసుకొంటుంది. ఆ క్రమంలో ఓ గొడవలో జోగినాథ్ (రవీంద్ర విజయ్) అనే వీధి రౌడీ చేతిలో ఉమామహేశ్వర్ చావుదెబ్బలు తింటాడు. ఆ అవమానంతో మళ్లీ జోగినాథ్‌ను చితక కొట్టేవరకు చెప్పులు వేసుకోనని శపథం చేస్తాడు. ఆ తర్వాత జోగినాథ్ చెల్లెలు జ్యోతి (రూప)తో ప్రేమలో పడుతాడు. స్వాతితో ఉమామహేశ్వర్ రావు ప్రేమ ఎందుకు విఫలమైంది? జోగినాథ్ చేతిలో చావుదెబ్బలు తిన్న ఉమామహేశ్వర్ చివరకు ప్రతీకారం తీర్చుకొన్నారా? జోగినాథ్ చెల్లెలు ప్రేమలో పడిన ఉమామహేశ్వర్‌కు ఏమైనా అడ్డంకులు ఎదరయ్యాయా? ఈ కథలో బాబ్జీ, నాంచారయ్య, సుహాస్ పాత్రలు ఎంత వరకు ఉపయోగపడ్డాయి అనే ప్రశ్నలకు సమాధానమే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్ర కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie ఉమామహేశ్వర ఉగ్రరూపస్య with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X