అన్‌స్టాపబుల్ సినిమా కామెడీ, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వి జె సన్నీ, సప్తగిరి, నక్షత్ర, అక్స ఖాన్, పోసాని కృష్ణ మురళి, బిత్తిరి సత్తి, పృథ్వి రాజ్, రాజ్ రవీంద్ర, రఘు బాబు, చమ్మక్ చంద్ర తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం డైమండ్ రత్నబాబు వహించారు. రజిత్ రావు నిర్మించారు. సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించారు.
రిలీజ్
ఈ మూవీ జూన్ 9న విడుదల అయ్యింది.
కథ
కోహినూర్ కల్యాణ్ (వీజే సన్నీ), జిలానీ రాందాస్ (సప్తగిరి) మంచి దోస్తులు. యూట్యూబ్‌లో సినిమా రివ్యూలు చెబుతుంటారు. కాలక్షేపం కోసం అప్పులు చేసి ఐపీఎల్ బెట్టింగ్‌లు ఆడి 10 లక్షల రూపాయలు పొగొట్టుకొంటారు. డబ్బులు తిరిగి ఇచ్చేందుకు స్నేహితుడు దుబాయ్‌లో ఉండే హానీ భాయ్ (షకలక శంకర్) నుంచి 20 లక్షలు ఇవ్వమని కోరుతారు. దాంతో తన స్నేహితులను ఆదుకొనేందుకు 20 లక్షలు ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేస్తే జ్ఞానవేల్ రాజా అకౌంట్‌లో పడుతాయి. ఐపీఎల్ బెట్టింగుల కోసం జిలానీ, కల్యాణ్ ఎవరి వద్ద నుంచి 10 లక్షలు అప్పు తీసుకొన్నారు? అప్పు తీర్చడానికి హానీ భాయ్ ట్రాన్స్‌ఫర్ చేసిన డబ్బులు జ్ఞానవేల్ రాజా అకౌంట్లో పడిన తర్వాత ఏం జరిగింది? కల్యాణ్, జిలానీ, స్వాతి (నక్షత్ర)ను తిలకం గ్యాంగ్ ఎందుకు బంధించారు? టైం టేబుల్ తులసి (అక్సా ఖాన్)ను తిలకం (రాజా రవీంద్ర) మనుషులు ఎందుకు కిడ్నాప్ చేశారు. జ్ఞానవేల్ రాజా అసలు ఎవరు? జ్ఞానవేల్ రాజా నుంచి 20 లక్షల రూపాయాలు తీసుకొన్నారా? జ్ఞానవేల్ రాజాతో కల్యాణ్ బ్యాచ్ ఆడిన నాటకం ఏంటి? ఎందుకు నాటకం ఆడాల్సి వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానమే అన్‌స్టాపబుల్ సినిమా
ట్రైలర్ విషయానికొస్తే..
కామెడీ, యాక్షన్ డ్రామాతో పాటు గ్లామర్‌తో నిండి ఉంది. వీజే సన్నీ, సప్తగిరి మంచి ఫ్రెండ్స్ కాగా.. క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పొగొట్టుకుని అప్పుల పాలవుతారు. ఎలాగైనా డబ్బు సంపాదించాలనే క్రమంలోనే విలన్.. మిస్సయిన తన డ్రగ్ కన్‌సైన్‌మెంట్ కోసం వెతుకుతుంటాడు. ఆ సరుకు సన్నీ, సప్తగిరికి దొరికితే.. వాళ్లు ఏం చేశారనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది. ఈ చిత్రంలో చాలా మంది ఆర్టిస్టులు కనిపించగా.. ‘బలగం’ సినిమాలో కొమురయ్య కూతురు లక్ష్మి పాత్రలో కనిపించిన రూప లక్ష్మి అటెన్షన్ గ్రాబ్ చేసింది. ఒక సీన్‌లో తను డబ్బు తీసుకురాకపోతే ముక్కలు ముక్కలుగా నరుకుతా అని వార్నింగ్ ఇస్తూ దర్శనమిచ్చింది. అయితే బలగంలో అమాయక గృహిణి పాత్రలో నటించగా.. తనలో మాస్ యాంగిల్ కూడా ఉందని తాజాగా నిరూపించింది.