వకీల్ సాబ్ సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యాణ్, నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అనన్య నాగల్ల, అంజలి, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు . హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమా తెలుగు రీమేక్ వకీల్ సాబ్. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు, బోని కపూర్, దిల్ రాజు కలిసి సంయుక్తంగా సినిమాని నిర్మించారు. తమన్ సంగీతం అందించారు.
కథ
పల్లవి (నివేదా థామస్), జరీనా (అంజలి), దివ్య నాయక్ (అనన్య నాగళ్ల) హైదరాబాద్‌లో వర్కింగ్ ఉమెన్స్. నగరానికి దూరంగా కారు పాడవడంతో ఈ ముగ్గురు యువతులు ఎంపీ రాజేంద్ర (ముఖేష్ రుషి) బంధువు వంశీతోపాటు మరో ఇద్దరు యువకులను కలుస్తారు. ప్రకృతి అనే రిస్టారుకు వెళ్లిన సమయంలో జరిగిన గొడవలో వంశీ గాయపడటం, ముగ్గురు యువతులు అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఎంపీ మనుషులు ముగ్గురు యువతులపై అక్రమ కేసులు బనాయించడంతో కోర్టులో సస్పెండ్ అయిన వకీల్ సాబ్ సత్యదేవ్ (పవన్ కల్యాణ్) కలుస్తారు. ప్రకృతి అనే రిసార్డులో వంశీ బ్యాచ్‌కు ముగ్గురు యువతులకు మధ్య ఏం జరిగింది? వంశీ తలకు బలమైన గాయం ఎందుకైంది. ఎంపీ రాజేంద్ర వర్గం ముగ్గురు యువతులపై ఎందుకు కేసులు పెట్టారు. ఏ పరిస్థితుల్లో సత్యదేవ్‌ను ముగ్గురు అమ్మాయిలు సహాయం కోరుతారు. ఈ కేసులో టాప్ లాయర్ నంద గోపాల్ (ప్రకాశ్ రాజ్)ను ఎందుకు రంగంలోకి దించాల్సి వచ్చింది. కోర్టులో రాజేంద్ర, సత్యదేవ్‌కు మధ్య ఎలాంటి వాదనలు జరిగాయి. ఈ కథలో శృతి హాసన్ పాత్ర ఏమిటి? చివరకు న్యాయం, ధర్మం ఎవరివైపు నిలబడిందనే ప్రశ్నలకు సమాధానమే వకీల్ సాబ్ సినిమా కథ.