వర్ణ సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు ఆర్య, అనుష్క శేట్టి తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సెల్వ రాఘవన్ నిర్వహించారు మరియు నిర్మాత ప్రసాద్ వి పోట్లూరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు హరీష్ జయరాజ్ స్వరాలు సమకుర్చరు.
కథ
మధు బాలకృష్ణ(ఆర్య) అనే సాప్ట్ గా ఉండే వ్యక్తిని రమ్య(అనుష్క) ప్రేమించి వెంటపడుతుంది. అయితే మొదటి ఆమె ప్రేమను ఏక్సెప్టు చేయకపోయినా...తర్వాత మెల్లిగా ఆమె ప్రేమలో పడ్డ మధు..ఆమె వెనక పడతాడు. ప్రేమ కథ క్లైమాక్స్ కి వచ్చిందనగా కథ లో ఊహించని ట్విస్ట్ వస్తుంది. ఇక రెండో లోకంలో జరిగే కథ విషయానికి వస్తే...అక్కడ పై లోకంలో జరిగే కథకు రివర్స్ లో జరుగుతంది. ప్రేమకు,స్వేచ్చకు అక్కడ చోటు ఉండదు. మహేంద్ర(మళ్ళీ ఆర్య) ... వర్ణ(మళ్లీ అనుష్క)ని ఇష్టపడి బలవంతంగానైనా సొంతం చేసుకోవాలనుకుంటాడు. అయితే వర్ణకు స్వేచ్చా జీవితం అంటే ఇష్టం..పెళ్లి చేసుకుని బానిసలా బతకాలని ఉండదు. దాంతో ఆమె ఈ ప్రపోజల్ కి ఇష్టపడదు. అప్పుడు ఆమెకు ఇష్టం లేకుండా ...మహేంధ్ర ఆమెను పెళ్లి చేసుకుంటాడు. దాన్ని ఆమె వ్యతిరేకించి వెళ్లిపోతుంది. ఇలా రెండు వేర్వేరు లోకాల్లో జరిగే రెండు విభిన్న కథలు...ఒక చోట ముడిపడి...మలుపు తిరుగుతాయి. ఇంతకీ ఆ రెండు కథలు కలిసే చోటు ఎక్కడ...రెండు ప్రేమ కథలు ఏ విధంగా ముగింపుకి వచ్చాయి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సింది.