X
వర్ణ

వర్ణ

Romance | 22 Nov 2013 | U |
Telugu

2.6 /5 Users

2 /5 Filmibeat

వర్ణ స్టోరీ

వర్ణ సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు ఆర్య, అనుష్క శేట్టి తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సెల్వ రాఘవన్ నిర్వహించారు మరియు నిర్మాత ప్రసాద్ వి పోట్లూరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు హరీష్ జయరాజ్ స్వరాలు సమకుర్చరు.  కథ మధు బాలకృష్ణ(ఆర్య) అనే సాప్ట్ గా ఉండే వ్యక్తిని రమ్య(అనుష్క) ప్రేమించి వెంటపడుతుంది. అయితే మొదటి ఆమె ప్రేమను ఏక్సెప్టు చేయకపోయినా...తర్వాత మెల్లిగా ఆమె ప్రేమలో పడ్డ మధు..ఆమె వెనక పడతాడు. ప్రేమ కథ క్లైమాక్స్ కి వచ్చిందనగా కథ లో ఊహించని ట్విస్ట్ వస్తుంది. ఇక రెండో లోకంలో జరిగే కథ విషయానికి వస్తే...అక్కడ పై లోకంలో జరిగే కథకు రివర్స్ లో జరుగుతంది. ప్రేమకు,స్వేచ్చకు అక్కడ చోటు ఉండదు. మహేంద్ర(మళ్ళీ ఆర్య) ... వర్ణ(మళ్లీ అనుష్క)ని ఇష్టపడి బలవంతంగానైనా సొంతం చేసుకోవాలనుకుంటాడు. అయితే వర్ణకు స్వేచ్చా జీవితం అంటే ఇష్టం..పెళ్లి చేసుకుని బానిసలా బతకాలని ఉండదు. దాంతో ఆమె ఈ ప్రపోజల్ కి ఇష్టపడదు. అప్పుడు ఆమెకు ఇష్టం లేకుండా ...మహేంధ్ర ఆమెను పెళ్లి చేసుకుంటాడు. దాన్ని ఆమె వ్యతిరేకించి వెళ్లిపోతుంది. ఇలా రెండు వేర్వేరు లోకాల్లో జరిగే రెండు విభిన్న కథలు...ఒక చోట ముడిపడి...మలుపు తిరుగుతాయి. ఇంతకీ ఆ రెండు కథలు కలిసే చోటు ఎక్కడ...రెండు ప్రేమ కథలు ఏ విధంగా ముగింపుకి వచ్చాయి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సింది.
Read More

వర్ణ కాస్ట్ & క్రూ

వర్ణ సిబ్బంది సమాచారం

దర్శకత్వం సెల్వ రాఘవన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం హారీష్ జయరాజ్
నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

వర్ణ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
అయితే ఈ సినిమా లో కథ కొత్తగా కాదు కానీ వింతగా ఉంటుంది. అప్పుడు కాస్త అర్దమయ్యే నేరేషన్ లో చెప్తే బాగుండేది. ఇక మొదటే చెప్పినట్లు ఈ చిత్రం కథ చాలా చిత్రాతి చిత్రంగా సాగుతుంది. దర్శకుడు ఏంగిల్ ఏంటో ఓ పట్టాన అర్దం కాదు...తన మానాన ప్రేక్షకుడుని పట్టించుకోకుండా కథని నేరేట్ చేసుకుంటూ పోతూంటాడు. ఏ క్యారెక్టర్ ఎందుకు వస్తుందో...ఎవరు ఎందుకు తమకు తోచినట్లు మాట్లాడుతూంటారో తెలియదు. సెల్వరాఘవన్ ఏదో అనుకుని ఏదో డెలవరి చేసారేమో అనిపిస్తుంది. అలాగే రెండో లోకంలో ఆర్య, అనుష్క తప్ప మన దేశం వారు ఎవరూ కనపడరు. చివరకు ఆర్య తల్లి తండ్రులు కూడా వేరే(జార్జియా కాబోలు) ఉంటారు. లక్కీగా అనుష్క కి తల్లి తండ్రిని పెట్టలేదు కాబట్టి ఆ డౌట్ రాదు. షూటింగ్ లొకేషన్ కి ఇక్కడ నుంచి జనాలని తీసుకెళ్లటం ఖర్చు అనుకున్నారో ఏమో కానీ విదేశీయులను పూర్తిగా వేరే లోకం చూపెడుతుంటే కొంచెం కూడా నమ్మబుద్ది కాదు.

వర్ణ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

వర్ణ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+