వెంకటాపురం సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాహుల్, మహిమా మాక్వన్, అజయ్, జోగిబ్రదర్స్, శశాంక్, అజయ్ ఘోష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వేణు మడికంటి వహించారు మరియు నిర్మాత ఎమ్ వి వి సత్యనారాయణ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అచ్చు స్వరాలు సమకుర్చరు.
కథ
ఆనంద్ (రాహుల్) పిజ్జా కార్నర్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తుంటాడు. చైత్ర (మహిమ మఖ్వానా) కాలేజీ స్టూడెంట్. వీరిద్దరూ ఒకే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుంటారు. చైత్ర కుటుంబం వైజాగ్‌కు షిఫ్ట్ అవుతుంది. తొలిచూపులోనే ఆనంద్ అంటే చైత్రకు అయిష్టం ఏర్పడుతుంది. కానీ ఓ పరిస్థితి కారణంగా ఆనంద్ అంటే ఇష్టం ఏర్పడుతుంది. అలా సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో అనుకొని సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఎగ్జామ్స్‌కు ముందు రోజు చైత్ర హాల్ టికెట్ తీసుకోవడానికి వెళ్తే అనుహ్యమైన సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ఆనంద్, చైత్ర జీవితంలో భయంకరమైన ఘటనగా మిగిలిపోతుంది. ఆ సంఘటన కారణంగా ఆనంద్, చైత్ర విడిపోతారు. ఆ ఘటనకు కారణమైన వారిపై ఆనంద్ పగ తీర్చుకోవాలనుకొంటాడు. ఆనంద్ ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటున్న వారు ఎవరు? చైత్రకు ఎదురైన సంఘటన ఏంటీ? దానికి ఆనంద్‌కు సంబంధమేమిటి? విడిపోయిన ఆనంద్, చైత్ర ఎలా కలుసుకొంటారు. ఈ కథకు ముగింపు ఏమిటి? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానమే వెంకటాపురం సినిమా.