X
తెలుగు » సినిమాలు » వెంకటాపురం
వెంకటాపురం

వెంకటాపురం

Action | Thriller | 12 May 2017 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

వెంకటాపురం స్టోరీ

వెంకటాపురం సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాహుల్, మహిమా మాక్వన్, అజయ్, జోగిబ్రదర్స్, శశాంక్, అజయ్ ఘోష్   తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వేణు మడికంటి వహించారు మరియు నిర్మాత ఎమ్ వి వి సత్యనారాయణ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అచ్చు స్వరాలు సమకుర్చరు. కథ ఆనంద్ (రాహుల్) పిజ్జా కార్నర్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తుంటాడు. చైత్ర (మహిమ మఖ్వానా) కాలేజీ స్టూడెంట్. వీరిద్దరూ ఒకే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుంటారు. చైత్ర కుటుంబం వైజాగ్‌కు షిఫ్ట్ అవుతుంది. తొలిచూపులోనే ఆనంద్ అంటే చైత్రకు అయిష్టం ఏర్పడుతుంది. కానీ ఓ పరిస్థితి కారణంగా ఆనంద్ అంటే ఇష్టం ఏర్పడుతుంది. అలా సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో అనుకొని సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఎగ్జామ్స్‌కు ముందు రోజు చైత్ర హాల్ టికెట్ తీసుకోవడానికి వెళ్తే అనుహ్యమైన సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ఆనంద్, చైత్ర జీవితంలో భయంకరమైన ఘటనగా మిగిలిపోతుంది. ఆ సంఘటన కారణంగా ఆనంద్, చైత్ర విడిపోతారు. ఆ ఘటనకు కారణమైన వారిపై ఆనంద్ పగ తీర్చుకోవాలనుకొంటాడు. ఆనంద్ ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటున్న వారు ఎవరు? చైత్రకు ఎదురైన సంఘటన ఏంటీ? దానికి ఆనంద్‌కు సంబంధమేమిటి? విడిపోయిన ఆనంద్, చైత్ర ఎలా కలుసుకొంటారు. ఈ కథకు ముగింపు ఏమిటి? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానమే వెంకటాపురం సినిమా.
Read More

వెంకటాపురం కాస్ట్ & క్రూ

వెంకటాపురం సిబ్బంది సమాచారం

దర్శకత్వం వేణు మడికంటి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అచ్చు రాజమణి
నిర్మాత యమ్ వి వి సత్యనారాయణ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

వెంకటాపురం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
వెంకటాపురం కథ విశాఖ సముద్ర తీరంలోని భీమిలి వద్ద ప్రారంభమవుతుంది. ఎంజాయ్ చేయడానికి వచ్చిన ఓ ప్రేమ జంటపై ముగ్గురు రౌడీలు దాడిచేస్తారు. యువకుడిని కొట్టి, అమ్మాయిని దారుణంగా రేప్ చేస్తారు. అంతలోనే ఆనంద్ (రాహుల్) కత్తి పట్టుకొని ఓ వ్యక్తిని వేటు వేస్తాడు. ఇలాంటి సన్నివేశాల ఆరంభంతో దర్శకుడు వేణు మాదికంటి ఆసక్తిని రేపేందుకు ప్రయత్నించారు. కథ రెండో భాగంలో ఉండటంతో తొలి భాగంలో చైత్ర కుటుంబం, చైత్ర కాలేజీ సీన్లు, పోలీసులు, రౌడీలకు సంబంధించిన సీన్లతో ఇంటర్వెల్ వరకు నెట్టుకొచ్చాడు. చిత్ర తొలిభాగంలో ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడం, సన్నివేశాలు బలంగా లేవనే ఫీలింగ్ ప్రేక్షకుడికి కలిగిస్తాయి. తొలి భాగంగా చాలా నాసిరకంగా, పరిపక్వత లేని సంభాషణలతో కాస్త బోర్‌ అనిపిస్తుంది. కాలేజీలో సీన్లు చాలా చెత్తగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పలు విభాగాలపై దర్శకుడికి అవగాహన లేదా అనిపించే స్థాయిలో ఉన్నాయి.

వెంకటాపురం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

వెంకటాపురం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+