విక్రమ్ కోబ్రా మూవీ యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్‌టైనర్ చిత్రం ఇందులో చియాన్ విక్రమ్, శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి, డైరెక్టర్ కెఎస్ రవికుమార్, టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, ఆనంద్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి అజయ్ జ్ఞానముత్తు ఆర్ దర్శకత్వం వహించారు. నిర్మాత లలిత్ కుమార్ నిర్మించారు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు
కథ
మది (విక్రమ్) మ్యాథమెటిక్స్‌లో జీనియస్. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పక్కా ప్లాన్ ప్రకారం హత్యలు చేస్తూ ఇంటర్‌పోల్, సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థలకు సవాల్ విసురుతాడు. భావన మీనన్ (శ్రీనిధి శెట్టి) అనే టీచర్‌తో ప్రేమలో మది ఉంటాడు. ఈ క్రమంలో రాజీవ్ రిషి (మలయాళ నటుడు రోషన్ మ్యాథ్యూ) మదిని చంపేందుకు వెంటాడుతుంటాడు. మరోవైపు అస్లాం (ఇర్ఫాన్ పఠాన్) అనే ఇంటర్ పోల్ అధికారి మదిని పట్టుకోనేందుకు ఇండియాలో ప్రయత్నాలు చేస్తుంటాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులను మది ఎందుకు హత్య చేస్తున్నాడు. స్కాట్లాండ్ యువరాణిని ఎందుకు కిడ్నాప్ చేశాడు? మదిని రాజీవ్ రిషి ఎందుకు చంపాలనుకొన్నాడు? రిషి ఏజెంట్‌గా పనిచేసే పోలీస్ ఆఫీసర్ (జాన్ విజయ్) మదిని ఎలా టార్గెట్ చేశాడు. మదితో జెడీ (మీనాక్షి)కి ఉన్న సంబంధం ఏమిటి? మది జీవితంలో జెన్నిఫర్ (మృణాళిని రవి) పాత్ర ఏమిటి? ఎందుకోసమైతే మది విధ్వంసం సృష్టిస్తున్నాడో ఆ లక్ష్యాన్ని చేరుకొన్నాడా? భావనతో మది పెళ్లి జరిగిందా? రిషి, మది మధ్య పోరాటానికి ఎలాంటి ముగింపు లభించింది. ఇంటర్‌పోల్ ఆఫీసర్ అస్లాం తన లక్ష్యాన్ని చేరుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే కోబ్రా సినిమా.