ఓటరు సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మంచు విష్ణు, సురభి, సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళి, నాజర్, ప్రగతి, బ్రాహ్మాజి, సుప్రీత్, శ్రవణ్, బేసన్, నాగర్ రవి, ఎల్ బి శ్రీరామ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జీ కార్తీక్ రెడ్డి వహించారు మరియు నిర్మాత జాన్ సుధీర్ పూదోట నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్ థమన్ అందించారు.
కథ
దేశభక్తి, సామాజిక బాధ్యత తెలిసిన గౌతమ్ (మంచు విష్ణు) ఓ ఎన్నారై సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇండియా వచ్చిన గౌతమ్ తొలిచూపులోనే భావన (సురభి) ప్రేమిస్తాడు. తన ప్రేమను గెలుచుకోవాలంటే సురభి కొన్ని షరతులు విధిస్తుంది. ఎమ్మెల్యే గొట్టం గోవిందం (పోసాని కృష్ణ మురళి) ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చేస్తే ప్రేమిస్తానని చెబుతుంది. దాంతో గౌతమ్ రంగంలోకి దిగుతాడు. ఆ క్రమంలో పేదల భూమిని కబ్జా చేసిన మంత్రి శంకర్ ప్రసాద్‌ను రాజకీయంగా ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఎమ్మెల్యే గోవిందంతో హామీలు నెర్చేలా చేయడానికి గౌతమ్ ఎలాంటి పంథాను అనుసరించాడు. తన ప్రేయసి ప్రేమను గెలుచుకొన్నాడా? మంత్రి ఆక్రమించిన పేదల భూమితో గౌతమ్‌కు సంబంధమేమిటి? ఓటరుగా ప్రజల మద్దతును గౌతమ్ ఎలా కూడగట్టారు. మంత్రి శంకర్ ప్రసాద్‌ను ఎలా ఎదుర్కొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే ఓటర్ సినిమా కథ.