వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ సరసన రాశీఖన్నా, ఇసబెల్లా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సినిమా ఫేం కాంత్రి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై వల్లభ నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతమందిస్తున్నాడు.
కథ
రచయితగా కావాలనుకొని ఆ కలతో బతికే గౌతమ్ (విజయ్ దేవరకొండ) తాను పనిచేసే కార్పోరేట్ ఉద్యోగాన్ని వదులుకొంటాడు. అయితే తన లివింగ్ పార్ట్‌నర్ యామిని (రాశీఖన్నా) తో గౌతమ్‌కు విభేదాలు తలెత్తడంతో బ్రేకప్ జరుగుతుంది. కానీ యామిని అంటే గౌతమ్‌కు చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. యామిని ప్రేమ కోసం పరితపించినప్పటికీ.. ఆమె ప్రేమను, సాన్నిహిత్యాన్ని పొందలేకపోతాడు. రచయితగా గౌతమ్ ఏ మేరకు రాణించాడు? బ్రేకప్ తర్వాత యామిని ప్రేమను పొందడానికి చేసిన ప్రయత్నాలు ఎందుకు బెడిసికొట్టాయి? చివరకు ఏ విధంగా యామిని ప్రేమను సొంతం చేసుకొన్నాడు? కథకు ఇల్లందు ట్రేడ్ యూనియన్ లీడర్ శ్రీను ( విజయ్ దేవరకొండ), (ఐశ్వర్య రాజేశ్), స్మిత (క్యాథరీన్ త్రెసా) పాత్రలు ఏ విధంగా భాగమయ్యాయి. అలాగే పైలెట్ ఇజా (ఇజబెత్ లీటీ)కి గౌతమ్‌కు ఎలాంటి రిలేషన్ ఉంటుంది? అనే ప్రశ్నలకు సమాధానమే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కథ.