యమలీల 2 (2014)(U/A)
Release date
28 Nov 2014
genre
యమలీల 2 స్టోరి
యమలీల 2 సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మోహన్ బాబు, డా కె వి సతీష్, డియానికోలస్, సదా, మరియు బ్రహ్మనందం, ఆలీ, కోట శ్రీనివాసులు, యమ్ ఎస్ నారాయణ, పొసాని క్రిష్ణ మురళి, వీళ్ళందరు ముక్య పాత్రాలలో నటించారు. ఈ చిత్రాన్ని డి ఎస్ మ్యాక్స్ సమర్పణలో క్రిస్వి ఫిలింస్ కె అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కథ-స్క్రీన్ ప్లే-సంగీతం-దర్శకత్వం: ఎస్ వి కృష్ణారెడ్డి అందించారు.
కథ
యమలీల లాగేనే... చిత్ర గుప్తుడు(బ్రహ్మానందం) మరోసారి భవిష్యవాణిని యముడుతో మానససరోవరానికి వచ్చినప్పుడు పోగొట్టుకుంటాడు. అప్పుడు బ్రహ్మ ఆదేశాల మేరకు...ఆ పుస్తకాన్ని వెతకటానికి భూలోకానికి బయిలుదేరతారు. ఈ లోగా ఆ పుస్తకం హీరో క్రిష్(సతీష్)కు దొరుతుంది. లుకేమియా కాన్సర్ మీద రీసెర్చ్ చేస్తున్న అతను ...సంజీవిని మూలికలు కోసం అక్కడకి వచ్చి ఉంటాడు. పుస్తకం దొరికిన అతను ఆ పుస్తకంలో తన భవిష్యత్ చూసి షాక్ అవుతాడు. ఆ పుస్తకం అతని వద్ద నుంచి యముడు, చిత్ర గుప్తుడు సంగ్రహించాలని చూస్తారు. మరో ప్రక్క స్టెఫిన్స్(ఆషిష్ విద్యార్ధి) తన స్టెఫిన్స్ ఫార్మిటికల్స్ కంపెనీ కోసం హీరో చేస్తున్న రీసెర్చ్ ఫలితం కోసం వెనక పడుతూంటాడు. అసలు హీరో కాన్సర్ పై రీసెర్చ్ ఎందుకంత సీరియస్ గా చేస్తున్నాడు... ఇందులో హీరోయిన్ ఆనంది (దియా నికోలస్) పాత్ర ఏమిటి...చివరకు ఏమైందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
**Note:Hey! Would you like to share the story of the movie యమలీల 2 with us? Please send it to us ([email protected]).