ఎవడే సుబ్రమణ్యం సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, రితు వర్మ, షావుకారు జానకి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి రచన,దర్శకత్వం: నాగ్ అశ్విన్ నిర్వహించారు మరియు నిర్మాత ప్రియాంకదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రధన్ స్వరాలు సమకుర్చారు.
కథ
"లైఫ్ లో నువ్వు ఎవరూ అనేది నీ బ్యాంక్ బ్యాలెన్స్ తోనే తెలుస్తుంది " అనేది మనసా వాచా నమ్మి అనుసరిస్తున్న వాడు సుబ్రమణ్యం(నాని)అలియాస్ సుబ్బు. ఇలాంటి వర్కోహాలిక్ కు ఇంకా చెప్పాలంటే కెరిర్ ఓరియెంటెడ్ కుర్రాడికి రిషి(విజయ్ దేవరకొండ) అనే చిన్ననాటి స్నేహితుడు ఉంటాడు. రిషిది క్వయిట్ ఆపోజిట్ మనస్వత్వం.. జీవితం ఉన్నది అనుభవించటానికి, ఆనందించటానికి అనేది అతని ఫిలాసఫి. ఈ క్రమంలో సుబ్బు తను నమ్మి ఆచరిస్తున్న సిద్దాంతంతో ఓ కార్పోరేట్ కంపెనీకు సీఈవో గా ఎదుగుతాడు. అంతేకాదు అతనికి రితు వర్మ తో ఎంగేజ్ మెంట్ సైతం అవుతుంది. ఈ లోగా ఓ రోజు అతన్ని గోవానుంచి రిషి ...తన స్నేహితురాలు ఆనందిని(మాళవిక నాయిర్) తో సహా వచ్చి కలుస్తాడు. అంతేకాదు రిషి అతన్ని ... తనకు అత్యంత ఇష్టమైన హిమాలయాలలోని రిషికేష్ దగ్గరలోని ధూథ్ కాశి వెళ్దామని బలవంటపెడతాడు. సుబ్బు దానికి ఒప్పుకోడు. అయితే ఓ అనుకోని పరిణామంతో అక్కడికి ఆనందినితో కలిసి బయిలుదేరతాడు. ఈ క్రమంలో అతనికి అసలు జీవితమంటే ఏమిటో తెలుస్తుంది. ఇంతకీ ఆ ఊహించని సంఘటన ఏమిటి.. ఇంతకీ ఆనందిని అసలు కథేంటి...సుబ్బుని జీవితం అంటే తెలుసుకునేలా చేసిన పరిస్ధితులు ఏమిటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.