X
తెలుగు » సినిమాలు » ఎవడే సుబ్రమణ్యం
ఎవడే సుబ్రమణ్యం

ఎవడే సుబ్రమణ్యం

Romance | 21 Mar 2015 | U |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

ఎవడే సుబ్రమణ్యం స్టోరీ

ఎవడే సుబ్రమణ్యం సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, రితు వర్మ , షావుకారు జానకి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి రచన,దర్శకత్వం: నాగ్ అశ్విన్ నిర్వహించారు మరియు నిర్మాత ప్రియాంకదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రధన్ స్వరాలు సమకుర్చారు. కథ "లైఫ్ లో నువ్వు ఎవరూ అనేది నీ బ్యాంక్ బ్యాలెన్స్ తోనే తెలుస్తుంది " అనేది మనసా వాచా నమ్మి అనుసరిస్తున్న వాడు సుబ్రమణ్యం(నాని)అలియాస్ సుబ్బు. ఇలాంటి వర్కోహాలిక్ కు ఇంకా చెప్పాలంటే కెరిర్ ఓరియెంటెడ్ కుర్రాడికి రిషి(విజయ్ దేవరకొండ) అనే చిన్ననాటి స్నేహితుడు ఉంటాడు. రిషిది క్వయిట్ ఆపోజిట్ మనస్వత్వం.. జీవితం ఉన్నది అనుభవించటానికి, ఆనందించటానికి అనేది అతని ఫిలాసఫి. ఈ క్రమంలో సుబ్బు తను నమ్మి ఆచరిస్తున్న సిద్దాంతంతో ఓ కార్పోరేట్ కంపెనీకు సీఈవో గా ఎదుగుతాడు. అంతేకాదు అతనికి రితు వర్మ తో ఎంగేజ్ మెంట్ సైతం అవుతుంది. ఈ లోగా ఓ రోజు అతన్ని గోవానుంచి రిషి ...తన స్నేహితురాలు ఆనందిని(మాళవిక నాయిర్) తో సహా వచ్చి కలుస్తాడు. అంతేకాదు రిషి అతన్ని ... తనకు అత్యంత ఇష్టమైన హిమాలయాలలోని రిషికేష్ దగ్గరలోని ధూథ్ కాశి వెళ్దామని బలవంటపెడతాడు. సుబ్బు దానికి ఒప్పుకోడు. అయితే ఓ అనుకోని పరిణామంతో అక్కడికి ఆనందినితో కలిసి బయిలుదేరతాడు. ఈ క్రమంలో అతనికి అసలు జీవితమంటే ఏమిటో తెలుస్తుంది. ఇంతకీ ఆ ఊహించని సంఘటన ఏమిటి.. ఇంతకీ ఆనందిని అసలు కథేంటి...సుబ్బుని జీవితం అంటే తెలుసుకునేలా చేసిన పరిస్ధితులు ఏమిటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

ఎవడే సుబ్రమణ్యం కాస్ట్ & క్రూ

ఎవడే సుబ్రమణ్యం సిబ్బంది సమాచారం

దర్శకత్వం నాగ్ అశ్విన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం రధన్
నిర్మాత ప్రియాంక దత్త్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఎవడే సుబ్రమణ్యం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఫైనల్ గా ట్రైలర్స్ ఉన్నంత గొప్పగా సినిమాలు ఉండవని మరోసారి ప్రూవ్ చేసిన సినిమాల్లో ఇది కూడా చేరిందనే చెప్పాలి. అలాగే...సెకండాఫ్ లో సీన్స్ బాగా సాగిన ఫీలింగ్ వచ్చింది. అక్కడ ఏమన్నా ట్రిమ్ చేసే అవకాసం ఉందేమో చూస్తే...నమ్మి థియోటర్ కు వెళ్లిన వారికి కాస్త సుఖంగా ఉంటుంది. ఏదైమైనా ఈ చిత్రం మల్టిఫ్లెక్స్ ల్లోకి వెళ్లినంతగా మిగతా సెంటర్లకు వెళ్తుందా అంటే సందేహమే. రెగ్యులర్ మసాలా చిత్రాలు చూసి బోర్ కొట్టినవారు.. కొత్త తరహా చిత్రం చూడాలి అనుకుంటే కొంచెం ఓపిక చేసుకుంటే ఇది మంచి ఆప్షనే.

ఎవడే సుబ్రమణ్యం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఎవడే సుబ్రమణ్యం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+