ఆ హీరోతో అనుపమ బ్రేకప్ ? ఇక నా జీవితం నాదే అంటూ..

టాలీవుడ్ అందాల భామ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు తన సహజ నటనతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నారు. వరుసగా హిట్స్ అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా ఎదిగారు. కేవలం తెలుగులోనే కాకుండా ఇత‌ర భాష‌ల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈ హీరోయిన్ మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి కారణం ఆమె కొత్త సినిమా కాదు. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ వల్ల. ఇంతకీ ఏం జరిగింది? ఏమన్నారు?

Also Read
Lenin 10 Days Box Office: 'లెనిన్' బాక్సాఫీస్ వేట.. అఖిల్ సినిమా ఎంత కొల్లగొట్టిందంటే?
Lenin 10 Days Box Office: 'లెనిన్' బాక్సాఫీస్ వేట.. అఖిల్ సినిమా ఎంత కొల్లగొట్టిందంటే?

అనుపమ్ 2015లో మలయాళ సినిమా 'ప్రేమమ్'తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనుపమ పరమేశ్వరన్, చాలా తక్కువ సమయంలోనే దక్షిణాది ప్రేక్షకులకు చేరువైంది. తెలుగులో 'అ ఆ', 'శతమానం భవతి', 'హలో గురు ప్రేమ కోసమే', 'కార్తికేయ 2', 'టిల్లు స్క్వేర్' వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. మొదట సంప్రదాయ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న అనుపమ, తర్వాత గ్లామర్‌తో పాటు వైవిధ్యమైన పాత్రలను కూడా ఎంచుకుంటున్నారు. తన ఇమేజ్‌ను పూర్తిగా మార్చుకుంది.

Recommended For You
RC17: రంగస్థలం, పెద్ది కంటే మించి.. రామ్ చరణ్ కోసం సుకుమార్ మాస్టర్ ప్లాన్..
RC17: రంగస్థలం, పెద్ది కంటే మించి.. రామ్ చరణ్ కోసం సుకుమార్ మాస్టర్ ప్లాన్..
Did Anupama Parameswaran Confirm Breakup with Dhruv Vikram

ఇక గత కొంతకాలంగా అనుపమ పరమేశ్వరన్, తమిళ స్టార్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ జంటగా 'బైసన్' సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే దగ్గరయ్యారనే వార్తలు వచ్చాయి. కొన్ని వ్యక్తిగత ఫొటోలు, ముఖ్యంగా ఇద్దరూ కలిసి కనిపించిన ఒక సన్నిహిత ఫొటో వైరల్ కావడంతో ఈ ప్రచారానికి మరింత ఊతం ఇచ్చింది. దీంతో త్వరలోనే ఈ జంట ఒకటి కాబోతున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ రిలేషన్‌పై ఇద్దరూ ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు.

You May Also Like
Spirit: ప్రభాస్ 'స్పిరిట్' లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. సందీప్ వంగా స్కెచ్ మామూలు లేదుగా..
Spirit: ప్రభాస్ 'స్పిరిట్' లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. సందీప్ వంగా స్కెచ్ మామూలు లేదుగా..

అయితే తాజాగా అనుపమ పరమేశ్వరన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మొదట ఆమె కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ, 'ఈ పోస్టు పెట్టడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. క్యాప్షన్ కోసం కూడా ఎవరినీ ఎదురు చూడాల్సిన అవసరం లేదు'అనే భావన వచ్చేలా రాసింది. ఈ వ్యాఖ్యలు చూసిన చాలామంది నెటిజన్లు ఆమె జీవితంలో ఏదో మార్పు జరిగిందని అనుకుంటున్నారు. ఈ క్రమంలో అనుపమ మరో లాంగ్ భావోద్వేగ పోస్టు చేసింది.

Bigg Boss Telugu 10: నాగార్జునకు మరో జాక్‌పాట్? బిగ్ బాస్ 10 రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?
Bigg Boss Telugu 10: నాగార్జునకు మరో జాక్‌పాట్? బిగ్ బాస్ 10 రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?

మరో పోస్ట్‌లో 'కొన్నిసార్లు మనశ్శాంతి కోసం ముగిసిపోయిన మార్గాలను వదిలేయాల్సి వస్తుంది. ఈ రోజు నుంచి నా గలాన్ని నేనే ఎంచుకుంటా.. నా జీవితాన్ని నేనే ఎంచుకుంటున్నాను. ఇకపై ఎవరి అనుమతులు అవసరం లేదు. భయం లేదు. నన్ను నేను మళ్లీ కనుగొంటున్నాను. నా జీవితంతో మళ్లీ ప్రేమలో పడుతున్నాను" అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు, 'చాలా కాలంగా నేను చెప్పాలనుకున్న విషయం ఉంది. కానీ చెప్పే అవకాశం రాలేదు. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ ప్రేమను నేను ఎప్పుడూ అనుభూతి చెందాను. నన్ను మళ్లీ నా వైపుకే నడిపించిన విశ్వానికి కృతజ్ఞతలు. ఇకపై నా జీవితాన్ని నేనే జీవిస్తాను'అంటూ భావోద్వేగంగా పేర్కొంది.

Jana Nayagan Advance Booking: అడ్వాన్స్ బుకింగ్స్ లో 'జన నాయగన్'రికార్డు.. విజయ్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Jana Nayagan Advance Booking: అడ్వాన్స్ బుకింగ్స్ లో 'జన నాయగన్'రికార్డు.. విజయ్ మూవీకి ఎన్ని కోట్లంటే?

అయితే.. ఈ పోస్ట్‌లో ఎక్కడా ధ్రువ్ విక్రమ్ పేరు ప్రస్తావించలేదు. డెడ్ ఎండ్స్, నో మోర్ పర్మిషన్స్, చూసింగ్ మై లైఫ్, ఫ్రీడమ్ వంటి పదాలు ఉపయోగించడంతో అది రిలేషన్‌షిప్‌కు సంబంధించిన సందేశమేనా అనే చర్చ మొదలైంది. ఆ పోస్ట్ చూసిన తర్వాత ఆమె వ్యక్తిగత జీవితంపై కొత్త చర్చ మొదలైంది. ముఖ్యంగా తమిళ హీరో ధ్రువ్ విక్రమ్‌తో ఆమె రిలేషన్‌షిప్ గురించి మరోసారి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతేకాదు.. అనుపమ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ధ్రువ్ విక్రమ్‌ను అన్‌ఫాలో చేసినట్లు నెటిజన్లు గుర్తించారు.

ప్రతి రోజూ అలా ప్రార్థించేదాన్ని.. సీతమ్మ పాత్ర కోసం సాయి పల్లవి చేసిన పని ఇదే!
ప్రతి రోజూ అలా ప్రార్థించేదాన్ని.. సీతమ్మ పాత్ర కోసం సాయి పల్లవి చేసిన పని ఇదే!

దీంతో బ్రేకప్ జరిగిందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకూ అనుపమ పరమేశ్వరన్ కానీ, ధ్రువ్ విక్రమ్ కానీ తమ ప్రేమ గురించి ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు. అలాగే బ్రేకప్ జరిగినట్లు కూడా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అందువల్ల ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతుంది. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ తెలుగులో శర్వానంద్ సరసన 'భోగి' సినిమాలో నటిస్తోంది. మరోవైపు ధ్రువ్ విక్రమ్ కూడా పలు కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అనుపమ చేసిన ఒక్క పోస్ట్ మాత్రం ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X