Brahmamudi: దుగ్గిరాల కుటుంబం నుంచి కళావతి ఔట్... షాక్‌లో రాజ్.. ఈవారం మొత్తం ట్విస్టులే!
బ్రహ్మాముడి సీరియల్ రోజు రోజుకు ఆసక్తిని కలగజేస్తుంది. ఈ సీరియల్ ఇప్పుడు మాటీవీలో ప్రసారం అయ్యే సీరియల్స్ లో బెస్ట్ రేటింగ్ సాధిస్తోంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే ఆగస్టు 7 నుంచి ఆగస్టు 13 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో చూద్దాం..
బ్రహ్మముడి ఆగస్టు 7 వ తేదీన ఎపిసోడ్ లో ట్విస్టులు చోటుచేసుకున్నాయి. ఇక ఈ ఎపిసోడ్ లో తన పని వదిలేసుకొని వచ్చినందుకు చిరాకు పడుతుంది అప్పు. దాంతో కల్యాణ్ అలా వెళ్ళిపోకు.. నాకు సహాయం చేయటానికి నువ్వు తప్ప ఇంకెవరున్నారంటూ.. పేరు కనుక్కోమని సవాల్ విసిరిన ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకోవడానికి నువ్వే సహాయం చేయాలి అని తనను అడుగుతాడు. మరోవైపు కావ్య తండ్రి అప్పు ఎలా తీర్చాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. పుల్ స్టోరీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

బ్రహ్మముడి ఆగస్టు 8 వ తేదీన ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఇక ఈ ఎపిసోడ్ లో ప్రారంభంలో రాహుల్ బాగా తాగి వస్తాడు. ఇదే మంచి ఛాన్స్ అనుకుని స్వప్న మురిసిపోతుంది. రాహుల్ మంచి మూడ్ లో ఉన్నాడు.. ఈ అవకాశాన్ని వాడుకోవాలి అని అనుకుంటుంది. రాహుల్ తాగిన మత్తులో నీకు ఏం కావాలో చెప్పు.. ఏదైనా ఇస్తాను అని చెబుతాడు. అప్పడు స్వప్న.. రాహుల్ తో బిడ్డను కంటే.. పర్మినెంట్ కోడలు అయిపోవచ్చు అని అనుకుంటుంది. ఇక రాహుల్ దగ్గరకు అవ్వాలని... స్వప్న రాహుల్ మీద పడుతుంది. మొత్తానికి వీళ్లిద్దరు ఒక్కటై పోతారు. పుల్ స్టోరీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
బ్రహ్మముడి ఆగస్టు 9వ తేదీన ఎపిసోడ్ కూడా ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఇక ఈ కావ్య తన పుట్టిల్లు తాకట్టులో ఉండటంతో.. తల్లిదండ్రులకు సాయం చేయాలనే ఉద్దేశ్యంతో కావ్య బొమ్మల కాంట్రాక్ట్ తీసుకుంటుంది. బొమ్మలు తయారు చేయడానికి అవసరమైన మట్టిని తానే స్వయంగా తొక్కుతుంది. ఆమె మట్టి తొక్కుతున్న వీడియోను మీడియా ద్వారా వైరల్ చేయిస్తాడు రాహుల్. దుగ్గిరాల ఫ్యామిలీ కోడలు కూలీ పనిచేసుకుంటూ బతుకుతుందని అబద్ధపు ప్రచారం చేయిస్తాడు.

బ్రహ్మముడి ఆగస్టు 10వ తేదీన ఎపిసోడ్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. రాహుల్ చెప్పుడు మాటలు నమ్మిన రాజ్...కావ్యకు వచ్చిన బొమ్మల కాంట్రాక్ట్‌ను క్యాన్సిల్ చేస్తాడు. భర్త చేసిన పనితో కావ్య షాకవుతుంది. పుట్టింటికి సాయం చేయబోయి అత్తింటికి కావ్య దూరమైందా.. కావ్య పుట్టింటి కష్టాలు తీర్చడం కోసం ఏం చేసింది.. రాజ్ తన తప్పును తెలుసుకున్నాడా.. తాను కోరుకున్నట్లుగానే కావ్య అతడి సాయం కోరిందా అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే.. పుల్ స్టోరీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
బ్రహ్మముడి ఆగస్టు 11వ తేదీన కూడా ఆసక్తి కలగించింది. ఈ ధారావాహికలో కావ్య పుట్టింటి కోసం చేసిన పని మీడియాలో వార్తలు వస్తాయి. అయితే వీటికి కావ్య ప్రెస్ మీట్ పెట్టి.. మీడియా వాళ్లను ప్రశ్నిస్తుంది. మరోవైపు రాహుల్ మాటలను నమ్మిన రాజ్.. కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయిస్తాడు. ఇక అపర్ణ.. కనకం ఇంటికి వచ్చి రచ్చ చేస్తుంది. పుల్ స్టోరీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

బ్రహ్మముడి ఆగస్టు 12 తేదీ ఎపిసోడ్ లో కావ్య దుగ్గిరాల కుటుంబం పరువు తీస్తుందని కనకం ఇంటికి వచ్చిన అపర్ణ మండిపడుతుంది. మరోవైపు మూర్తికి వచ్చిన కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయిస్తాడు రాజ్. దీంతో కోపంగా ఇంటికి వెళ్తుంది కావ్య. అక్కడికి వెళ్లిన కావ్యను అపర్ణ నానా మాటలు అంటుంది. ఇంట్లో ఉండాలంటే పద్దతిగా ఉండాలని చెబుతుంది. నేను తప్పు చేయలేదు.. ఉండను అని చెబుతుంది కావ్య. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మని అంటుంది అపర్ణ. అది విన్న రాజ్ షాక్ అవుతాడు. పుల్ స్టోరీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications











