Brahmamudi: కావ్య ముందే ప్రేమగా శ్వేతతో రాజ్... రుద్రాణి కంటే అరాచకంగా అనామిక ప్లాన్స్!

బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తుంది. ఈ వారం మొత్తం అనేక ట్విస్టులతో సీరియల్ సాగింది. ఇక ఈ వారం అనామిక, కల్యాణ్ ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయగా.. అనామిక రచ్చ రచ్చ చేస్తుంది. మరోవైపు రాజ్, శ్వేత బంధం గురించి కావ్య తెలుసుకుంటుంది. శ్వేతతో క్లోజ్ గా ఉండటం కావ్య చూస్తుంది. అసలు రాజ్, శ్వేతకు సంబంధం ఏంటి.. లాయర్ ను విడాకుల కోసం రాజ్ ఎందుకు కలిశాడు.. కావ్యకు రాజ్ అన్యాయం చేయనున్నాడా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

జనవరి 15వ తేదీ బ్రహ్మముడి సీరయల్లో... అనామిక, కల్యాణ్ ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారు. దీనితో అనామికకు గిఫ్ట్ ఇవ్వాలని కవి అనుకుంటాడు. ఈ క్రమంలోనే కల్యాణ్ రెండు హారాలను తీసుకువచ్చి కావ్యను సెలెక్ట్ చేయమని అడుగుతాడు. ఇక అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి వచ్చి కావ్యపై సెటైర్స్ వేస్తుంది. ఎప్పుడైనా చూసిన మొఖమా.. ఆమెకు ఏం తెలుసు అని వెటకారం చేస్తుంది. ఇక కావ్యను కల్యాణ్ బతిమిలాడగా.. కావ్య ఒకటి సెలక్టే చేస్తుంది. ధాన్యలక్ష్మి చూసి రగిలి పోతుంది.

Brahmamudi Telugu Serial Weekly Roundup 2023 December 15th to December 20th episode

జనవరి 16వ తేదీ బ్రహ్మముడి సీరియల్లో... కల్యాణ్ అనామిక ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్తారు. అనామిక శోభనం గదిలో విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇక కల్యాణ్ కవిత చెప్పబోతుంటే.. ఆపు సోది అన్నట్లు గా మాట్లాడుతుంది. సరే అని కల్యాణ్ ఓ హారం గిఫ్టుగా ఇస్తే బాగుందని చెప్తుంది. అది ఎవరు సెలెక్ట్ చేశారో కల్యాణ్ చెప్పగానే.. రచ్చ రచ్చ చేస్తుంది. శోభనం గదిని చెదరగొట్టి.. హాల్లోకి వచ్చి పడుకుంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జనవరి 17వ తేదీ బ్రహ్మముడి సీరియల్లో... స్వప్న.. తన అత్త రుద్రాణి ఓ ఆట ఆడేసుకుంటూ ఉంటుంది. పొద్దున్నే లేపి కాఫీ తీసుకుని రమ్మని చెప్తుంది. ఇక రుద్రాణి లేచి హాల్లోకి వచ్చేసరికి.. అనామిక కనిపిస్తుంది. ఈ ఇంట్లో మరో కాపురం సంకనాకినట్లు ఉందని మనసులో అనుకుంటుంది. ఇంట్లో వాళ్లకు చెప్పాలని అందరినీ లేపుతుంది. ఇక అందరూ లేచి.. అనామికను లేపుతారు. ఏమైందని అడుగుతారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జనవరి 18వ తేదీ బ్రహ్మముడి సీరియల్లో... ఇక అనామిక తన శోభనం ఆగిపోయిన విషయం ఇంట్లో వాళ్లకు చెప్తుంది. మా ఇద్దరి మధ్య కల్యాణ్.. కావ్య, అప్పు సంగతి తీసుకువస్తున్నాడని చెప్తుంది. ఇక కల్యాణ్, అనామికకు సర్ది చెప్తారు. మరోవైపు కావ్య మీద ధాన్యలక్ష్మి, రుద్రాణి ఫైర్ అవుతారు. కావ్యకు సపోర్టుగా రాజ్ నిలుస్తాడు. ఇక అనామకి తన పెరెంట్స్ కు ఫోన్ చేసి.. తన శోభనం చెడగొట్టుకున్నట్లు చెప్తుంది. కావ్యకు పోయి సారీ చెప్పి... నేను మంచిదానిలాగా నటిస్తాను అంటూ కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

Brahmamudi Telugu Serial Weekly Roundup 2023 December 15th to December 20th episode

జనవరి 19వ తేదీ బ్రహ్మముడి సీరియల్లో... కనకం ఇంటికి పెళ్లి పత్రిక ఇచ్చేందుకు పక్కింటి శాంత వస్తుంది. ఇక అప్పు గురించి తప్పుగా మాట్లాడుతుంది. మీలాగా అల్లుళ్లు దొరకలేదని దెప్పి పొడుస్తుంది. అప్పు పెద్దమ్మా.. ఆమెను చెప్పుతో కొడతా అంటూ తిడుతుంది. మరోవైపు రాజ్ ఆఫీసులో వర్క్ ఉంది అని 11 గంటలకు లేచి వెళ్తాడు. డిజైన్స్ ఫైనల్ చేయాలని వెళ్తాడు. శ్వేత ఇంట్లోకి ఓ అజ్ఞాతవ్యక్తి వెళ్తాడు. అక్కడ ఆమె ఇంట్లోకి వెళ్లి చప్పుళ్లు చేస్తూ ఉంటాడు. శ్వేత భయపడిపోతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జనవరి 20వ తేదీ బ్రహ్మముడి సీరియల్లో... శ్వేత ఇంటికి రాజ్ వస్తాడు. ఇంట్లో ఎవరో ఉన్నాడు అని రాజ్ కు శ్వేత చెప్తుంది. టీవీ ఆన్ అయిందని.. ఫ్లవర్ వాజ్ కిందపడిందని.. కత్తి కిందపడిందని చెప్తుంది. ఎవరు రారు.. అంటూ రాజ్ సర్ది చెప్తూ ఉంటాడు. భయంతో రాజ్ తో క్లోజ్ గా ఉంటుంది శ్వేత. ఆ వీడియోను ఎవరో అజ్ఞాత వ్యక్తి వీడియో తీసి కావ్యకు పంపిస్తాడు. అది చూసిన కావ్య.. షాక్ అవుతుంది. బాధపడుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X