Brahmamudi: తల్లికి షాక్ ఇచ్చిన కావ్య... రుద్రాణి, రాహుల్ కొత్త ప్లాన్... కాలిపోయిన లగ్న పత్రిక
బ్రహ్మముడి సీరియల్ మరింత ఆసక్తిగా సాగుతుంది. ఈ వారం కూడా ట్విస్టులతో సాగింది. అరుణ్ కోసం.. కావ్య వేట మొదలుపెట్టేసింది. మరోవైపు కల్యాణ్, అనామిక పెళ్లికి ఏర్పాట్లు మొదలు అవుతాయి. ఈ క్రమంలో కనకం ఎంటర్ అయి.. వారి పెళ్లిని చెడగొట్టేందుకు ప్లాన్స్ వేస్తుంది. కానీ చివరకు కావ్యనే తల్లి కనకానికి షాక్ ఇస్తుంది. ఇలా వారం మొత్తం ఉత్కంఠగా సాగింది. డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 9 వరకు ఏం జరిగిందో ఈస్టోరీలో తెలుసుకుందాం.
నవంబర్ 4వ తేదీ బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ లో స్వప్న కోసం స్వీట్లు తయారు చేసుకుని కనకం బయలుదేరుతుంటే మూర్తి వచ్చి వద్దంటాడు. తన అవసరం అనుకుంటే కన్నతల్లి అని కూడా చూడకుండా నిన్ను ఇబ్బందులు పెడుతుంది అని చెప్తాడు. అయినా సరే కనకం వెళ్లడానికే బయలుదేరుతుంది. అప్పును కూడా తనతో రమ్మంటే అప్పు రానని చెప్పి బయటికి వెళ్లిపోతుంది. అప్పును జాగ్రత్తగా చూసుకోమని తన అక్కకు చెప్పి బయలుదేరుతుంది. కావ్య, రాజ్ కారులో వచ్చి ఒక ఇంటి ముందు ఆగి దిగుతారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

డిసెంబర్5వ తేదీ బ్రహ్మముడి ఎపిసోడ్ లో స్వప్నకు ఇంత అవమానం జరిగాక ఇక ఈ ఇంట్లో ఉండనివ్వనని కనకం డ్రామా మొదలుపెడుతుంది. స్వప్నను పుట్టింటికి తీసుకెళ్తానని చెప్తుంది. స్వప్నను అన్ని సర్దుకుని రమ్మని చెప్తుంది. నిజంగానే ఇంటికి తీసుకెళ్లేదే అయితే మాటలు ఎందుకు చెప్తుందని రుద్రాణికి డౌట్ వస్తుంది. ఎక్కడో తేడా కొడుతుందని రుద్రాణి మనసులో అనుకుంటుంది. స్వప్న.. తన తల్లి కనకం మాటలకు కన్ఫూజ్ అవుతుంది. పుట్టింటికి వస్తే... ఇటు అత్తింటికి అటు పుట్టింటికి అవమానం అని ఆలోచిస్తున్నావు కదా అని స్వప్నతో కనకం అంటుంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
డిసెంబర్ 6వ తేదీ బ్రహ్మముడి ఎపిసోడ్ లో అరుణ్ కావాలనే తప్పించుకున్నాడు అంటూ కావ్య.. రాజ్ తో అంటుంది. ఆ సీఐడీ ఇన్వెస్టిగేషన్ ఆపుతావా అని రాజ్ అంటాడు. హస్పటల్ కు వెళ్తే లేడు.. ఇంటికి వెళ్తే లేడు... కావాలనే తప్పించుకుని వెళ్తున్నాడు అనిపించడం లేదా అని కావ్య అంటుంది. మీ అక్కనే హ్యాపీగా ఉంటుంది.. నీకెందుకు ఇవన్నీ వదిలేయ్ అని రాజ్ సలహా ఇస్తాడు. నేను వదలను... ఆడవాళ్లపై నింద వేస్తే ఎలా వదిలేస్తాను... అని కావ్య అవుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
డిసెంబర్ 8వ తేదీ బ్రహ్మముడి ఎపిసోడ్ లో డైనింగ్ టేబుల్ దగ్గర తినకుండా ధాన్యలక్ష్మి కూర్చుంటుంది. అది చూసిన అపర్ణ ఏమైందని అడుగుతుంది. కళ్యాణ్ పెళ్లి విషయంలో పంతులు గారు చెప్పిన విషయం గురించే ఆలోచిస్తున్నారు అని కనకం అంటుంది. అవును.. కళ్యాణ్ ఇష్టపడ్డాడు కదా అని ఏమీ ఆలోచించకుండా ఈ పెళ్లికి ఒప్పుకున్నానని ధాన్యలక్ష్మి అంటుంది. కానీ ఇలాంటి దోషం ఉంటే ఇంటి పెద్దకు గండం అంటున్నారు... వాళ్ల కాపురం కూడా నిలబడదు అంటున్నారు. ఇన్ని అనర్థాలు చూసే బదులు ఈ పెళ్లి ఆపేయడమే మంచిదనిపిస్తుందని ధాన్యలక్ష్మి అంటుంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
డిసెంబర్ 9వ తేదీ బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ లోఒక్కగానొక్క కొడుకు పెళ్లి ఇలా అయిపోయిందని ధాన్యలక్ష్మి అనుకుంటుంది. ఇక్కడ అందరికీ ఒక్కగానొక్క కొడుకులే ఉన్నారని రుద్రాణి అంటుంది. ఇప్పుడు ఆ మొక్క చనిపోయి ఉంటే పెళ్లి ఆపేస్తారా అని అడుగుతుంది. అలా ఎందుకు జరుగుతుంది. మొక్క బతికే ఉంటుంది అనుకోవచ్చు కదా అని అపర్ణ చెప్తుంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications










