Brahmamudi: అనామిక, కల్యాణ్ శోభనం... కావ్యను దూరంగా ఉంచేందుకు ధాన్యలక్ష్మి ప్లాన్
బ్రహ్మముడి ఎపిసోడ్ గతవారం మొత్తం ఆసక్తిగా కొనసాగింది. ముఖ్యంగా అనామిక, కల్యాణ్ పెళ్లి తర్వాత ట్విస్టులతో ఆసక్తిగా రక్తికట్టించారు. కల్యాణ్ ను మరిచిపోలేక అప్పు పడే బాధ.. మరోవైపు కల్యాణ్ ను గుప్పింట్లో పెట్టుకునేందుకు అనామిక ప్లాన్స్.. ఇవన్నీ ప్రేక్షకులకు ఆసక్తి పెంచేలా ఎపిసోడ్స్ ను తెరకెక్కించారు. ఇక మరోవైపు రాజ్.. శ్వేత అనే అమ్మాయితో ఉండటం కావ్య చూడటం కూడా మరో ట్విస్టు. భర్తతో ఇంకో అమ్మాయి చనువుగా ఉన్నా కానీ ప్రశ్నించకుండా తనలో తానే బాధపడుతూ.. కావ్య ఉంది. ఇక ఈ వారం పూర్తి ఎపిసోడ్ వివరాల్లోకి వెళితే...
గత సోమవారం కావ్య ఆటోలో వెళ్తూ.. రాజ్, శ్వేత క్లోజ్ గా ఉండటం చూస్తుంది. ఆఫీసులో కూడా శ్వేతతో కలిసి రాజ్ విడాకుల మ్యాటర్ మాట్లాడుతూ ఉంటాడు. శ్వేతను రాజ్ పంపించే క్రమంలో కావ్య చూస్తుంది. కానీ ఏమి మాట్లాడదు. టిఫిన్ ఇచ్చేసి వెళ్తుంది. ఇక ఆ తర్వాత కావ్య పరధ్యానంగా ఆటోలో వెళ్తుండగా అప్పు కనిపిస్తుంది. అప్పును ఇంటికి తీసుకువెళ్లి మాట్లాడుతుంది. ఇంతలో కృష్ణ మూర్తి వచ్చి... నువ్వు మా ఇంటికి రావొద్దు అంటూ చెప్తాడు.

జనవరి 9వ తేదీ బ్రహ్మముడి ఎపిసోడ్ లో కల్యాణ్.. ఓల్డ్ లుక్ లో ఉంటావంటూ తన లుక్ మొత్తం మార్చేస్తుంది. చినిగిపోయిన ప్యాంట్ వేసి.. హెయిర్ స్టైల్ మార్చి.. చెవికి రింగ్ పెట్టి... కల్యాణ్ ను మార్చుతుంది. ఇక కల్యాణ్ అద్దంలో చూసుకుని ఇలా ఉన్నాను అని ఆశ్చర్యపోతాడు. ఇదే మోడ్రన్ అని చెప్తుంది అనామిక. ఇంట్లోవాళ్లు కూడా బాగున్నవ్ అంటూ కామెంట్ చేస్తారు. మరోవైపు అప్పుకు పెళ్లి సంబందాలు చూస్తాడు మూర్తి. పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
జనవరి 10వ తేదీ బ్రహ్మముడి ఎపిసోడ్ లో అప్పుకు పెళ్లి సంబంధాలు చూస్తారు. ఇక పెళ్లి కోడుకల ఫోటోలు పెళ్లిళ్ల బ్రోకర్ పట్టుకుని వస్తాడు. అప్పు ఈ విషయం తెలుసుకుని వాడిని పరిగెత్తించి మరీ కొడుతుంది. మరోవైపు కల్యాణ్, అనామిక సత్యనారాయణ వ్రతం ఏర్పాట్లను కావ్య చేస్తుంది. రుద్రాణి వచ్చి దీపపు కుందే పడేసి కావ్య మీద నెట్టేస్తుంది. ధాన్యలక్ష్మి, అపర్ణ వచ్చి ఫైర్ అవుతారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జనవరి 11వ తేదీ బ్రహ్మముడి ఎపిసోడ్ లో అనామిక, కల్యాణ్ సత్యనారాయణ వ్రతంలో ఇద్దరు మనవాళ్లు కూడా కూర్చొవాలి అని ఇందిరాదేవి ఆర్డర్ వేస్తుంది. దీంతో రాజ్ కావ్య, స్వప్న రాహుల్ రెడీ అయ్యేందుకు వెళ్తారు. స్వప్న తన అత్త రుద్రాణితో సేవలు చేయించుకుంటుంది. మరోవైపు కావ్య రెడీ అవుతుంటే... కనకం ఫోన్ చేసి.. అప్పుకు యాక్సిడెంట్ అయిందని చెప్తుంది. దీంతో కావ్య రాజ్ కు చెప్పి.. వ్రతం ఆగకుండా చూడండి అంటూ చెప్పి వెళ్లిపోతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జనవరి 12వ తేదీ బ్రహ్మముడి ఎపిసోడ్ లో అప్పుకు యాక్సిడెంట్ కావడంతో.. కావ్య వెళ్లిపోతుంది. అక్కడ అప్పుకు ఓ నెగిటివ్ బ్లడ్ కావాలని డాక్టర్స్ చెబుతారు. ఎక్కడ వెతికినా ఓ నెగిటివ్ బ్లడ్ దొరకదు. రాజ్ కు కాల్ చేస్తే.. కల్యాణ్ ఎత్తి మాట్లాడుతాడు. నా బ్లడ్ కూడా అదే అంటూ నేను వస్తాను అని కల్యాణ్ వెళ్లిపోతాడు. దీంతో వ్రతం ఆగిపోతుంది. మరోవైపు కావ్య కావాలనే వ్రతం ఆపేందుకు వెళ్లిందని ఇంట్లో వాళ్లంతా నిందలు వేస్తారు. రాజ్ సపోర్టుగా మాట్లాడుతాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జనవరి 13వ తేదీ బ్రహ్మముడి ఎపిసోడ్ లో అప్పు ప్రాణాలు కాపాడేందుకు కల్యాణ్ వచ్చి బ్లడ్ ఇస్తాడు. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో కావ్య, కల్యాణ్ ఇంటికి వస్తారు. అందరూ కావ్యను తప్పుబడతారు. ఇక అనామికకు కల్యాణ్ సారీ చెప్తాడు. ఇక ఇంట్లో వాళ్లంతా అనామిక, కల్యాణఅ ఫస్ట్ నైట్ ఏర్పాటు చూస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications










